Breaking News

చేసేది ఎక్కువ.. ఇచ్చేది తక్కువ!

Published on Mon, 12/22/2025 - 14:22

ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఉద్యోగులు పనిచేసే చేసే పని గంటలకు, అందుకు వారికి లభించే వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారతీయులు వారానికి ఎక్కువ గంటలు శ్రమిస్తున్నప్పటికీ వారి సంపాదన మాత్రం ఆయా దేశాల ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉంటోంది. 2024-25 నాటి గణంకాలు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదికల ఆధారంగా వివిధ దేశాల పనిగంటలు, వేతనాల విశ్లేషణ కింద చూద్దాం.

వివిధ దేశాల పనిగంటలు.. వేతనాల పరిశీలన

దేశంసగటు వారపు పనిగంటలుసగటు నెలవారీ వేతనంగంటకు ఆదాయం
అమెరికా34 - 36 గంటలురూ.5,60,000రూ.4,100
జర్మనీ34 - 35 గంటలురూ.4,50,000రూ.3,100
జపాన్38 - 40 గంటలురూ.3,10,000రూ.1,900
చైనా46 - 48 గంటలురూ.1,40,000రూ.750
భారతదేశం46 - 48 గంటలురూ.32,000రూ.170

 

గమనిక: ఈ వేతనాలు ఆయా దేశాల కరెన్సీ విలువను ప్రస్తుత మారకపు రేటు ప్రకారం రూపాయిల్లోకి మార్చగా వచ్చిన సగటు విలువలు. రూపాయి విలువను అనుసరించి వీటిలో మార్పులుంటాయని గమనించాలి.

అభివృద్ధి చెందిన దేశాల పరిస్థితి

  • అమెరికా, జర్మనీ దేశాల్లో వారానికి కేవలం 35 గంటల లోపు పనిచేస్తూనే భారీ వేతనాలను అందుకుంటున్నారు. ఇక్కడ స్మార్ట్ వర్క్, హై-టెక్నాలజీ వినియోగం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పాదకత లభిస్తుంది.

  • ఒకప్పుడు అధిక పనిగంటలకు పేరుగాంచిన జపాన్, ప్రస్తుతం వర్క్-లైఫ్ బ్యాలెన్స్ వైపు మొగ్గు చూపుతోంది. 40 గంటల పని పరిమితిని కచ్చితంగా అమలు చేస్తోంది.

  • చైనాలో కూడా పనిగంటలు భారత్‌తో సమానంగా ఉన్నప్పటికీ అక్కడి ఉత్పాదకత, తయారీ రంగం బలంగా ఉండటం వల్ల వేతనాలు భారత్ కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

భారత్‌లో ఎందుకీ పరిస్థితి?

  • భారతదేశంలో కార్మికులు లేదా ఉద్యోగులు అత్యధిక సమయం పనిచేస్తున్నా తక్కువ ఆదాయాన్ని పొందడానికి ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 90% పైగా శ్రామిక శక్తి అసంఘటిత రంగంలోనే ఉంది. ఇక్కడ కచ్చితమైన వేతన చట్టాలు లేదా పనిగంటల నియంత్రణ తక్కువగా ఉంటుంది.

  • అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక గంటలో తయారయ్యే వస్తువు/సర్వీసు విలువ, భారత్‌లో తయారయ్యే దానికంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం అధునాతన సాంకేతికత, మెరుగైన మౌలిక సదుపాయాలు లేకపోవడం.

  • శ్రమ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల కంపెనీలు తక్కువ వేతనాలకే ఉద్యోగులను నియమించుకోగలుగుతున్నాయి. డిమాండ్ కంటే సప్లై ఎక్కువగా ఉండటం వల్ల బేరమాడే శక్తి ఉద్యోగులకు తక్కువగా ఉంటోంది.

  • భారత్‌లో జీవన వ్యయం (Rent, Food, Medical) అమెరికా, జర్మనీలతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి రూపాయి విలువ పరంగా తక్కువగా కనిపించినా స్థానిక అవసరాలకు అది సరిపోతుందని కంపెనీల వాదన. అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో పోల్చినప్పుడు ఇది భారీ వ్యత్యాసంగానే కనిపిస్తుంది.

భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేగంగా ఎదుగుతున్నప్పటికీ సామాన్య ఉద్యోగికి దక్కే ఫలితం ఇంకా ఆశాజనకంగా లేదు. పనిగంటలను తగ్గించి, వేతనాలను పెంచాలంటే ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, ఆటోమేషన్, సంఘటిత రంగం విస్తరణపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: పొల్యూషన్‌ సర్టిఫికేట్‌ లేకుంటే నో పెట్రోల్!

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)