Breaking News

ఖతార్‌లోనూ ‘క్యూఆర్‌’ 

Published on Thu, 09/25/2025 - 04:47

న్యూఢిల్లీ: భారత్‌లో రూపొందిన క్యూఆర్‌ ఆధారిత చెల్లింపుల విధానం యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోకి కూడా విస్తరిస్తోంది. తాజాగా ఖతార్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందుకోసం ఖతార్‌ నేషనల్‌ బ్యాంకుతో (క్యూఎన్‌బీ) ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ (ఎన్‌ఐపీఎల్‌) ఒప్పందం కుదుర్చుకుంది. దీనితో యూపీఐ అందుబాటులోకి వచ్చిన ఎనిమిదో దేశంగా ఖతార్‌ నిల్చింది. 

ఇప్పటిదాకా భూటాన్, నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రవేశపెట్టారు. దీనితో ఆయా దేశాలను సందర్శించే భారతీయులు విదేశీ కరెన్సీ కోసం చూసుకోవాల్సిన అవసరం లేకుండా తక్షణం రూపాయి మారకంలోనే చెల్లింపులు జరిపేందుకు వీలవుతుంది. 

డిజిటల్‌ చెల్లింపులను సులభతరంగా చేసిన యూపీఐ లావాదేవీలు దేశీయంగా కొత్త రికార్డులను తాకుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో సుమారు రూ. 25 లక్షల కోట్ల విలువ చేసే 2,000 కోట్ల లావాదేవీలను యూపీఐ ప్రాసెస్‌ చేసింది. రెండేళ్లలోనే రోజువారీ లావాదేవీల పరిమాణం రెట్టింపయ్యింది. ఏడాది వ్యవధిలోగా రోజుకు 100 కోట్ల యూపీఐ లావాదేవీల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)