Breaking News

టైర్ల పరిశ్రమకు ప్రీమియం దన్ను 

Published on Sun, 09/21/2025 - 06:05

న్యూఢిల్లీ: ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్, ఎగుమతులు పెరుగుతుండటం వంటి సానుకూల అంశాల తోడ్పాటుతో దేశీ టైర్ల పరిశ్రమ రాబోయే రోజుల్లో గణనీయంగా వృద్ధి చెందనుంది. 2047 నాటికి పరిశ్రమ ఆదాయం 12 రెట్లు పెరిగి రూ. 13 లక్షల కోట్లకు చేరనుంది. ఆటోమోటివ్‌ టైర్ల తయారీ సంస్థల సమాఖ్య ఏటీఎంఏ, కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 

దేశీయంగా వాహనాల తయారీ సంస్థలు (ఓఈఎం), రీప్లేస్‌మెంట్‌కి సంబంధించి టైర్లకు డిమాండ్‌ నెలకొనడం, వాహన ఎగుమతులు వేగవంతం కావడంలాంటి అంశాలు టైర్ల పరిశ్రమ వృద్ధికి దోహదపడతాయని నివేదిక వివరించింది. 2047 నాటికి దేశీయంగా టైర్ల తయారీ పరిశ్రమ ఉత్పత్తి పరిమాణం సుమారు నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వ్యవధిలో ఆదాయం 12 రెట్లు వృద్ధి చెంది రూ. 1,300 కోట్ల మేర పెరగవచ్చని రిపోర్ట్‌ తెలిపింది.   

నివేదిక ప్రకారం ‘వికసిత భారత్‌ 2047’ లక్ష్యం దిశగా భారత్‌ ప్రస్థానం సాగిస్తుండటం, టైర్ల పరిశ్రమకు గణనీయంగా అవకాశాలు కల్పిస్తుంది. దేశీ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చడమే కాకుండా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లాంటి కీలక మార్కెట్లకు వాణిజ్య, ప్యాసింజర్‌ వాహనాలకు ఉపయోగపడే టైర్లను మరింతగా ఎగుమతి చేసేందుకు కూడా ఇది తోడ్పడుతుందని పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్‌ కవన్‌ ముఖ్తియార్‌ తెలిపారు. 

వినియోగదారులు, మొబిలిటీ ధోరణులు మారుతుండటం, అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితులు ఎప్పటికప్పుడు కొత్త మార్పులకు లోనవుతుండటం, పర్యావరణహితమైన ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుండటమనే విషయాలు, భారతీయ టైర్ల పరిశ్రమ తనను తాను కొత్తగా మల్చుకునేందుకు ఒక చక్కని అవకాశం కల్పిస్తాయని పేర్కొన్నారు. రిపోర్ట్‌ ప్రకారం మౌలిక సదుపాయాలపై వ్యయాలు, దేశీయంగా వినియోగం పటిష్టంగా ఉండటంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల ఓఈఎం, రీప్లేస్‌మెంట్‌ టైర్లపరమైన ఆదాయాలు 2047 ఆర్థిక సంవత్సరం నాటికి వార్షికంగా 10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. ఇక ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నందున భారతీయ టైర్లకు విదేశీ మార్కెట్లలోను అవకాశాలు పెరగనున్నాయి.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి