Breaking News

బ్రిటిష్‌ రాణి కారు కొన్న ఇండియన్‌ బిజినెస్‌ టైకూన్‌.. ఎవరీ యోహాన్?

Published on Sun, 02/25/2024 - 18:24

బ్రిటిష్ రాచరిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన భాగాన్ని భారతీయ బిజినెస్‌ టైకూన్‌ సొంతం చేసుకున్నారు. బ్రిటిష్‌ రాణి దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రేంజ్ రోవర్ కారును పూనావాలా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ యోహాన్ పూనావాలా కొనుగోలు చేశారు. దివంగత రాణి ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఈ కారు ఇప్పటికీ కలిగి ఉండటం విశేషం.

విశేషమైన చరిత్రను ఉన్న కారును సొంతం చేసుకున్నందుకు పూనావాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను అలాగే ఉంచడం అదనపు బోనస్ అని ఆయన పేర్కొన్నారు. "ఈ అద్భుతమైన ఆటోమోటివ్ చరిత్రను సంపాదించినందుకు నేను సంతోషిస్తున్నాను" అని పూనావాలా చెప్పినట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ పేర్కొంది. “సాధారణంగా రాజ కుటుంబం ఆధీనం నుంచి వెళ్లిపోయిన తర్వాత కారు నంబర్ ప్లేట్ మారుతుంది. ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే.. దివంగత క్వీన్ ఉపయోగించిన అదే రిజిస్ట్రేషన్ నంబర్ OU16 XVHని ఇప్పటికీ కలిగి ఉంది. ఇది అదనపు బోనస్‌గా మారింది” అని ఆయన చెప్పారు.

ఐవరీ అప్హోల్స్టరీతో లోయిర్ బ్లూ పెయింట్ చేసిన 2016 రేంజ్ రోవర్ SDV8 ఆటోబయోగ్రఫీ LWB ఎడిషన్ కారు సుమారు 18,000 మైళ్లు తిరిగింది. బ్రామ్లీ ఆక్షనీర్స్ వెబ్‌సైట్‌లో ఈ కారు రిజర్వ్ ధర 224,850 పౌండ్లు (రూ. 2.25 కోట్లకు పైగా) ఉంది. అయితే ఈ వేలం ప్రక్రియ లేకుండానే పూనావాలా కారును ప్రైవేట్‌గా కొనుగోలు చేశారు.

కారు ప్రత్యేకతలివే..
ఈ రేంజ్ రోవర్ కారును ప్రత్యేకంగా రాణి ఉపయోగించేందుకు రూపొందించారు. రహస్య లైటింగ్, పోలీసు ఎమర్జెన్సీ లైటింగ్‌తో సహా ప్రత్యేకమైన మార్పులు ఇందులో ఉన్నాయి. రాణి కోసం చేసిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే.. సులువుగా కారు ఎక్కేందుకు, దిగేందుకు వెనుక భాగంలో గ్రాబ్ హ్యాండిల్స్ జోడించడం. కారులో చేసిన అన్ని మార్పులను అలాగే ఉంచాలని భావిస్తున్నట్లు పూనావాలా పేర్కొన్నారు.

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)