Breaking News

రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు

Published on Wed, 04/16/2025 - 11:23

రైల్లో ప్రయాణికులకు లిక్విడ్‌ క్యాష్‌ అవసరాలు తీర్చేందుకు, బ్యాంకింగ్‌ సర్వీసులు మరింత చేరువ చేసేందుకు వీలుగా ప్రముఖ బ్యాంకులు కొత్త సేవలు ప్రారంభిస్తున్నాయి. వైవిధ్యంగా ఆలోచించి రైలు ప్రయాణికులకు నేరుగా రైల్లోనే ఏటీఎం సేవలు అందించిందుకు సిద్ధమవుతున్నాయి. నాసిక్‌లోని మన్మాడ్-ముంబై మధ్య నడిచే పంచవతి ఎక్సెప్రెస్‌ ఏసీ బోగీలో ఇటీవల దేశంలోని మొదటి ఏటీఎం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర భుసావల్ డివిజన్ సహకారంతో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు.

రైలు ప్రయాణంలో కొన్నిసార్లు సిగ్నల్‌ లేకపోవడం సహజం. దాంతో మన్మాడ్-ముంబై మధ్య ఇగత్పురి, కసారా సమీపంలోని కొన్ని సొరంగాల కారణంగా సిగ్నల్‌లో అవాంతరం చోటుచేసుకుందని ట్రయల్‌రన్‌లో గమనించినట్లు అధికారులు తెలిపారు. అది మినహా ట్రెయిల్‌ పరీక్ష సజావుగా సాగిందని రైల్వే సిబ్బంది పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పది నిమిషాల్లో ఇంటికే సిమ్‌ కార్డులు

ఈ సందర్భంగా భుసావల్ డీఆర్ఎం పాండే మాట్లాడుతూ..‘ప్రజలు ఇప్పుడు కదిలే రైలులో నగదు ఉపసంహరించుకోవచ్చు. ఏటీఎం పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రైలులోని మొత్తం 22 బోగీలను వెస్టిబుల్స్(రెండు బోగీల మధ్య ప్రయాణించేందుకు వీలైన మార్గం) ద్వారా అనుసంధానం చేశాం. దాంతో ప్రయాణికులు ఏటీఎంను సులభంగా చేరుకోవచ్చు’ అని చెప్పారు. ప్రయాణికుడు సంజయ్ ఝా మాట్లాడుతూ ‘ఈ ఏటీఎం ద్వారా అన్ని సేవలు నిర్వహించుకోవచ్చు. డబ్బును ఉపసంహరించుకోవచ్చు. చెక్ బుక్ లను ఆర్డర్ చేయవచ్చు. స్టేట్‌మెంట్లను పొందవచ్చు. ప్రయాణ సమయంలో ఈ సర్వీసు  చాలా తోడ్పడుతుంది’ అన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)