Breaking News

మారిన తత్కాల్ టికెట్ బుకింగ్‌ రూల్స్: ఏప్రిల్ 15 నుంచే అమలు

Published on Fri, 04/11/2025 - 11:10

ఇండియన్ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో కొన్ని కీలకమైన మార్పులు చేసింది.. కొత్త రూల్స్ 2025 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బుకింగ్ టైమ్స్, క్యాన్సిలేషన్ విధానం, చెల్లింపు మొదలైనవన్నీ కొత్త నియమాలలో భాగంగా మారుతాయి. టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా IRCTC ఈ రూల్స్ తీసుకొచ్చింది.

తత్కాల్ అనేది ప్రయాణీకులకు.. తక్కువ సమయంలో అత్యవసర ప్రయాణ టిక్కెట్లను అందించడానికి భారతీయ రైల్వే ప్రవేశపెట్టిన ఒక విధానం. ఈ విధానం ద్వారా లక్షలాది మంది ప్రయాణికులు ప్రయోజనం పొందినప్పటికీ.. తత్కాల్ సిస్టం ఏజెంట్ దుర్వినియోగం, సాంకేతిక లోపాలు, డిమాండ్-సరఫరా అంతరాయాల కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

కొత్త టైమింగ్
ఏప్రిల్ 15 నుండి తత్కాల్ బుకింగ్ విషయంలో రానున్న మార్పులలో ఒకటి 'సమయం' అనే చెప్పాలి. క్లాస్ ఆధారంగా సమయం మారుతుంది. తత్కాల్ టికెట్స్ కోసం ఒకరోజు ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త టైమింగ్ ప్రకారం ఏసీ క్లాస్ బుకింగ్స్  ఉదయం 11:00 గంటలకు, నాన్ ఏసీ / స్లీపర్ బుకింగ్ మధ్యాహ్నం 12:00 గంటలకు, ప్రీమియం తత్కాల్ బుకింగ్ ఉదయం 10:30 గంటలకు మొదలవుతాయి. రేపు ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే.. ఈ రోజే తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.

IRCTC వెబ్‌సైట్ & మొబైల్ యాప్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రక్రియను మెరుగైన సామర్థ్యం కోసం అప్‌గ్రేడ్ చేశారు. కొత్త వ్యవస్థ కింద అనుసరించాల్సిన విషయాలు ఈ కింద గమనించవచ్చు..

➤ IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి
➤ ట్రైన్, క్లాస్ ఎంచుకోండి (ఏసీ/నాన్ ఏసీ)
➤ డ్రాప్ డౌన్ నుంచి తత్కాల్ కోటాను సెలక్ట్ చేసుకోండి
➤ ప్రయాణీకుల వివరాలు, ఐడీ ప్రూఫ్ నెంబర్‌ను ఎంటర్ చేయండి
➤ చెల్లింపు పేజీకి వెళ్లి బుకింగ్ పూర్తి చేయండి

కొత్త మార్పులు
➤ సమయం ఆదా చేయడానికి రిజిస్ట్రేషన్ వినియోగదారుల కోసం ప్రయాణీకుల వివరాలను స్వయంచాలకంగా నింపడం.
➤ చెల్లింపు గడువు 3 నిమిషాల నుంచి 5 నిమిషాలకు పెరిగింది.
➤ బుకింగ్ లోపాలను తగ్గించడానికి కాప్చా ధృవీకరణ సరళీకృతం చేసారు.
➤ యాప్ లేదా వెబ్‌సైట్ రెండింటికీ ఒకేవిధమైన లాగిన్ సిస్టమ్
➤ ఒక తత్కాల్ PNR కింద గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
➤ తత్కాల్ కోటా కింద ఎటువంటి రాయితీ వర్తించదు.
➤ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డు తప్పనిసరి.

గమనిక: కొన్ని ఆంగ్ల మీడియా కథనాల ఆదరణ ఈ వార్త ప్రచురించడం జరిగింది. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి మార్పు లేదని IRCTC అధికారికంగా వెల్లడించింది. పాఠకులు గమనించగలరు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)