Breaking News

రైలు ప్రయాణికులకు అలర్ట్‌.. ట్రైన్‌ ఎక్కే ముందు తప్పక తెలుసుకోండి..

Published on Sun, 02/11/2024 - 20:58

దేశవ్యాప్తంగా రోజూ కొన్ని ల‌క్ష‌ల‌ మంది రైళ్లలో ప్రయాణం చేస్తుంటారు. ప్ర‌జా అవ‌స‌రాలు, స‌రుకుల ర‌వాణా కోసం ఇండియ‌న్ రైల్వేస్‌ వేల సంఖ్యలో రైళ్ల‌ను నడుపుతోంది. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించ‌డం సహజంగా జరిగే ప్రక్రియ. అయితే కొన్ని సంద‌ర్భాల్లో రైలు బయలుదేరే సమయానికి కౌంటర్ వద్ద క్యూ ఎక్కువగా ఉండ‌టం వల్లనో లేదా టికెట్ కొనే స‌మ‌యం లేక‌పోవ‌డం వ‌ల్లనో కొంద‌రు టికెట్ లేకుండానే రైళ్లలో ప్ర‌యాణిస్తూ ఉంటారు.

ఏది ఏమైనా టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించడం చట్టరీత్యా నేరం. రైళ్లలో ప్రయాణికులు అందరూ టికెట్‌ తీసుకున్నారా.. ఎవరైనా టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నారా అన్నది పరీశీలించడానికి టీటీఈలు (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామిన‌ర్) ఉంటారు. వీరిలో కొంతమంది టికెట్‌ లేని ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. వేలాది రూపాయ‌లు వసూలు చేస్తుంటారు.

 

టికెట్‌ లేకపోతే ఏం చేయాలి..
రైళ్లలో రోజూ కొన్ని ల‌క్షల మంది ప్యాసింజ‌ర్లు ప్రయాణిస్తుంటారు. వీరిలో కొంద‌రు  టికెట్ లేకుండా ప్రయాణించే సంద‌ర్భం వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కొంద‌రు టీటీఈలు దురుసుగా  ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇటీవ‌ల లక్నో ఎక్స్‌ప్రెస్‌లో ఓ రైల్వే అధికారి ప్రయాణికుడిపై చేయి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌న్ని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేసింది రైల్వే శాఖ‌. ఇలా అధికారులు ప్రవర్తించవచ్చా..  టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు ఏం చేయాలి అన్న విషయాలు ఇక్కడ తెలుసుకుందాం... 

ఇదీ చదవండి: IRCTC: రైల్వే ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌లో మార్పులు

టికెట్ లేకుండా రైలు ఎక్కిన ప్రయాణికులు మొద‌ట‌గా టీటీఈని సంప్రదించి మీ పరిస్థితి గురించి వారికి తెలియజేయాలి. మీ వద్ద రిజర్వేషన్ టికెట్ లేకపోతే మీరు వెళ్ళాల్సిన గమ్య స్థానానికి అయ్యే టికెట్ ధ‌ర‌తో పాటు రూ.250 జరిమానా విధిస్తారు. అంటే మీరు రైలు ఎక్కిన ప్రదేశం నుండి గమ్యస్థానానికి అయ్యే చార్జీతో పాటు అద‌నంగా రూ. 250  చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేశాక ఒక‌వేళ‌ ట్రైన్‌లో సీట్లు కాళీ ఉంటే సీటును కూడా కేటాయిస్తారు.

ఇదీ చదవండి: ఓటీపీలకు స్వస్తి.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)