Breaking News

పెరిగిన రైలు ఛార్జీలు..

Published on Mon, 06/30/2025 - 21:32

దేశవ్యాప్తంగా రైలు ఛార్జీలు జూలై 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ మేరకు సుదూర రైళ్లలో జూలై 1 నుంచి రైలు ఛార్జీలు పెంచనున్నట్లు భారతీయ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే బోర్డు నోటిఫికేషన్ ప్రకారం కిలోమీటర్‌కు గరిష్టంగా 2 పైసలు చొప్పున ఛార్జీల పెంపు ఉంటుంది. నాన్ ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు ఒక పైసా, ఏసీ బోగీల్లో కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెరగనున్నాయి. సబర్బన్ రైళ్లు, 500 కిలోమీటర్ల వరకు సాధారణ సెకండ్ క్లాస్ ప్రయాణాలపై ఎలాంటి ప్రభావం ఉండదు.

రైలు ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే..

రైలు రకం    ఛార్జీల పెంపు..
సెకండ్ క్లాస్ ఆర్డినరీ501-1500 కిలోమీటర్లకు రూ.5 పెంపు
సెకండ్ క్లాస్ ఆర్డినరీ1501-2500 కిలోమీటర్లకు రూ.10 పెంపు
సెకండ్ క్లాస్ ఆర్డినరీ2501-3000 కిలోమీటర్లకు రూ.15 పెంపు
స్లీపర్ క్లాస్ జనరల్‌కిలో మీటరుకు అర పైసా
ఫస్ట్ క్లాస్ ఆర్డినరీకిలో మీటరుకు అర పైసా
సెకండ్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్‌)కిలో మీటరుకు ఒక పైసా
స్లీపర్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్‌)కిలో మీటరుకు ఒక పైసా
ఫస్ట్ క్లాస్ (మెయిల్/ఎక్స్‌ప్రెస్‌)కిలో మీటరుకు ఒక పైసా
ఎసి చైర్ కారుకిలో మీటరుకు రెండు పైసలు
ఎసి-3 టైర్/3ఈకిలో మీటరుకు రెండు పైసలు
ఏసీ-2 టైర్కిలో మీటరుకు రెండు పైసలు
ఏసీ ఫస్ట్ క్లాస్/ఈసీ/ఈఏకిలో మీటరుకు రెండు పైసలు

రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, ఏసీ విస్టాడోమ్ కోచ్, తదితర రైళ్లకు కూడా పైన పేర్కొన్న ప్రకారం ఛార్జీల పెంపు వర్తిస్తుంది. భారతీయ రైల్వే రైలు ఛార్జీలను పెంచడం 2022 తర్వాత ఇదే తొలిసారి. రిజర్వేషన్ ఫీజు, సూపర్‌ఫాస్ట్ సర్‌ఛార్జ్ వంటి ఇతర ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని భారతీయ రైల్వే తెలిపింది. మంత్లీ సీజన్ టికెట్స్ , సబర్బన్ రైలు ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు.

రిజర్వేషన్ చార్టుల్లో మార్పులు..
రైలు ఛార్జీలను పెంచడంతో పాటు, సుదూర రైళ్ల రిజర్వేషన్ చార్ట్‌లను బయలుదేరడానికి ఎనిమిది గంటల ముందు సిద్ధం చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్టులు తయారు చేసేవారు.

తత్కాల్ బుకింగ్స్ లో మార్పులు?
తత్కాల్ టికెట్‌ బుకింగ్ కోసం ఆధార్‌ను రైల్వే శాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఆధార్ ధృవీకరణ పూర్తి చేసిన ప్రయాణికులు మాత్రమే జూలై 1 నుండి ఐఆర్‌సీటీసీ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా జూలై నెలాఖరు నుంచి తత్కాల్ బుకింగ్స్ కోసం ఓటీపీ ఆధారిత అథెంటికేషన్‌ను కూడా అమలు చేయనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)