Breaking News

రైలు టికెట్లు రయ్‌మని బుక్‌ అయ్యేలా.. కొత్త అప్‌గ్రేడ్‌ వస్తోంది

Published on Sun, 08/17/2025 - 09:38

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణికులు ఉపయోగించే ఇండియన్ రైల్వే టికెట్ బుకింగ్ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రైల్వే శాఖ కొత్తగా తీసుకొస్తున్న డిజిటల్ అప్‌గ్రేడ్ ద్వారా టికెట్ బుకింగ్ వేగం నాలుగు రెట్లు పెరగనుంది. పండుగ కాలాల్లో, ప్రత్యేక రైళ్ల సమయంలో, లేదా జనరల్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉండే సందర్భాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఆలస్యం, సాంకేతిక సమస్యలు తగ్గనున్నాయి.

కొత్త పాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ (PRS) ద్వారా నిమిషానికి 1 లక్ష టికెట్లు బుక్ చేయగల సామర్థ్యం కలుగుతుంది. పీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం నిమిషానికి 25,000 టికెట్లు బుక్‌ చేసే సామర్థ్యం ఉంది. ఈ అప్‌గ్రేడ్‌లో భాగంగా క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్, మెరుగైన నెట్‌వర్క్, భద్రతా వ్యవస్థలు, ఆధునిక హార్డ్‌వేర్ అమలు చేయబోతున్నారు.

ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి రైల్వే శాఖ రైల్‌వన్‌ (RailOne) అనే కొత్త సూపర్ యాప్‌ను కూడా ఇటీవల ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్, పీఎస్‌ఆర్‌ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫుడ్ ఆర్డర్, ఫీడ్‌బ్యాక్ వంటి సేవలను ఒకే చోట పొందగలుగుతారు. రైల్‌వన్‌ యాప్‌లో సింగిల్ సైన్-ఆన్ విధానం అమలులో ఉంది. దీని ద్వారా బయోమెట్రిక్ లేదా ఎంపిన్‌ ద్వారా లాగిన్ చేయవచ్చు. పలు ప్రాంతీయ భాషల మద్దతుతో, ఈ యాప్ గ్రామీణ, ప్రాంతీయ ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలిగిస్తోంది.

అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ (ARP) పరిమితిని కూడా రైల్వే శాఖ ఇదివరకే తగ్గించింది. అప్పటివరకు ప్రయాణానికి 120 రోజుల ముందు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండగా, నవంబర్ 1, 2024 నుంచి దీన్ని 60 రోజులకు పరిమితం చేసింది. ఇక దీపావళి, ఛఠ్ పూజా వంటి పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఊరట కలిగించేందుకు, రైల్వే శాఖ ఫెస్టివల్‌ రౌండప్‌ ట్రిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద అక్టోబర్ 13–26, నవంబర్ 17–డిసెంబర్ 1 మధ్య రిటర్న్ టికెట్లపై 20% డిస్కౌంట్ అందిస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)