Breaking News

దేశీయంగానే కీలక ఖనిజాల అన్వేషణ 

Published on Sat, 09/20/2025 - 05:12

న్యూఢిల్లీ: రాగి సహా కీలక ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేలా, దేశీయంగానే మరింతగా ఉత్పత్తి చేయడంపై ప్రభుత్వ రంగ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హిందుస్తాన్‌ కాపర్‌ (హెచ్‌సీఎల్‌), ఆయిల్‌ ఇండియా (ఆయిల్‌) అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా కీలక ఖనిజాల వెలికితీత, ఉత్పత్తికి ఇది ఉపయోగపడనుంది. 

క్రూడాయిల్‌ వెలికితీత, ఉత్పత్తి, రవాణాలో ఆయిల్‌ ఇండియాకు అపార అనుభవం ఉంది. అటు గనుల శాఖలో భాగమైన హెచ్‌సీఎల్‌కి కాపర్‌ తదితర ఉత్పత్తుల మైనింగ్, ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌లో అనుభవం ఉంది. రాగికి సంబంధించి దేశీయంగా మైనింగ్‌ లీజులన్నీ కంపెనీకే ఉన్నాయి. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, గెయిల్‌ ఇండియా రైట్స్‌లాంటి ప్రభుత్వ రంగ సంస్థల తరహాలోనే క్రిటికల్‌ మినరల్స్, రేర్‌ ఎర్త్‌ ఎలిమెంట్‌ బ్లాక్‌ల కోసం బిడ్డింగ్‌ చేయనున్నట్లు హిందుస్తాన్‌ కాపర్‌ ఇప్పటికే ప్రకటించింది. 

దేశీ, విదేశీ మార్కెట్లలో కీలక ఖనిజాలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు కంపెనీతో, ఇంజనీరింగ్‌ సంస్థ రైట్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణహితమైన ఇంధనాల విషయంలో స్వావలంబన సాధించే దిశగా కేంద్రం ప్రాథమికంగా రూ. 16,300 కోట్లతో జాతీయ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌ను ప్రకటించింది. ఏడేళ్లలో దీనిపై మొత్తం రూ. 34,300 కోట్లు వెచి్చంచనుంది. రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్, రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌లాంటివి, స్వచ్ఛ ఇంధన టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కీలకమైన ముడి వనరులుగా ఉపయోగపడతాయి.  
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు