విస్తరిస్తోన్న భారత ఫార్మా మార్కెట్‌

Published on Fri, 08/16/2024 - 14:05

భారతదేశం ఎగుమతి చేస్తున్న ఫార్మా ఉత్పత్తులు, వైద్య పరికరాల పరిశ్రమ విస్తరిస్తున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రంగంలో భారీగా దిగుమతి చేసుకుంటున్న యూఎస్‌, యూకే, ఇటలీలో భారత్‌ మార్కెట్‌ వాటా పెరుగుతోందని పేర్కొంది. యూఎస్‌కు ఔషధాలను అందించే దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉందని చెప్పింది. త్వరలో రెండో స్థానానికి చేరుతామని అంచనా వేసింది.

పరిశ్రమల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం..‘యూఎస్‌, యూకే, ఇటలీ దేశాలు దిగుమతి చేసుకునే ఇండియా ఫార్మా ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యూఎస్‌కు ఔషధాలు ఎగుమతి చేసే దేశాల్లో ఐర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. ఈ రెండు దేశాలతో పోలిస్తే భారత్‌ 2023లో తన యూఎస్‌ మార్కెట్‌ వాటాను విస్తరించింది. త్వరలో రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది. 2022లో 7.33 బిలియన్‌ డాలర్లుగా(రూ.61 వేలకోట్లు) ఉన్న యూఎస్‌లోని భారత్‌ ఔషధ దిగుమతులు 2023లో 9.08 బిలియన్‌ డాలర్ల(రూ.76 వేలకోట్లు)కు పెరిగాయి. దాంతో ఇది 13.1%కు చేరింది. యూఎస్‌కు ఎగుమతిదారుగా ఐర్లాండ్, స్విట్జర్లాండ్‌ వాటాలు వరుసగా 13.85%, 13.7%కు పడిపోయాయి.

ఇదీ  చదవండి: ‘అనిశ్చితులున్నా కరెంట్‌ ఇస్తాం’

ఇటలీలోని యాంటీబయాటిక్స్ విభాగంలో భారత్‌ తన వాటాను పెంచుకుంది. అక్కడి మార్కెట్‌లో భారత్‌ పదో స్థానంలో ఉంది. అయితే 2022లో 0.96% ఉన్న ఇండియా వాటా 2023లో 2.12%కు పెరిగింది. విలువ పరంగా యాంటీబయాటిక్స్ ఎగుమతులు 2023లో 23.34 మిలియన్‌ డాలర్ల(రూ.195 కోట్లు)కు చేరాయి. జర్మనీకి ఎగుమతి చేసే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్‌(ఎంఆర్‌ఐ) పరికరాల మార్కెట్‌ పెరిగింది. 2022లో దాని వాటా 0.45 శాతంగా ఉండేది. అది 2023లో 1.7%కు చేరింది. విలువ పరంగా ఈ ఎగుమతులు 2023లో 13.02 మిలియన్‌ డాలర్ల(రూ.109 కోట్లు)కు చేరుకున్నాయి. ఇదిలాఉండగా, భారత్‌ ఇలా ఫార్మా రంగంలో వృద్ధి చెందడానికి కేంద్ర అందిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు(పీఎల్‌ఐ) కారణమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)