Breaking News

వృద్దివైపు పరుగులు పెడుతున్న ఫార్మా - పెరుగుతున్న ఎగుమతులు

Published on Tue, 09/12/2023 - 07:19

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఫార్మా పరిశ్రమ ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. నియంత్రిత మార్కెట్లకు పెరుగుతున్న ఎగుమతులు, దేశీయంగా స్థిరమైన వృద్ధి నమోదవుతుండటం ఇందుకు దోహదపడనున్నాయి. క్రిసిల్‌ రీసెర్చ్‌ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. 

దీని కోసం 186 ఔషధ తయారీ సంస్థలపై అధ్యయనం చేసింది. రూ. 3.7 లక్షల కోట్ల పరిశ్రమ వార్షిక ఆదాయంలో వీటి వాటా దాదాపు సగం ఉంటుంది. నేషనల్‌ ఫార్మా ప్రైసింగ్‌ అథారిటీ (ఎన్‌పీపీఏ) అనుమతించిన మేరకు ధరలను పెంచడం కూడా పరిశ్రమ ఆదాయ వృద్ధికి దోహదపడగలదని క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ అనికేత్‌ డానీ తెలిపారు. 

అమ్మకాల పరిమాణం 3–4% మేర పెరిగేందుకు ప్రస్తుతమున్నవి, కొత్తగా ప్రవేశపెట్టే ఔషధాలు తోడ్పడగలవని వివరించారు. ముడివస్తువులు, లాజిస్టిక్స్‌ వ్యయాలు, అమెరికా జనరిక్స్‌ మార్కెట్లో ధరలపరమైన ఒత్తిడి తగ్గుదలతో ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహణ లాభదాయకత 50–100 బేసిస్‌ పాయింట్లు పెరిగి 21 శాతానికి చేరవచ్చని తెలిపారు. 

అమెరికాలో ధరలపరమైన ఒత్తిడి, ముడి వ్యయాల పెరుగుదల కారణంగా వరుసగా రెండేళ్ల పాటు మార్జిన్లు తగ్గినట్లు క్రిసిల్‌ నివేదిక పేర్కొంది. ‘ఆసియాకు ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరం ఒక మోస్తరుగా ఉండగా, ఈసా రి మెరుగుపడవచ్చు. ఆఫ్రికా దేశాల దగ్గర విదేశీ మారక నిల్వలు తక్కువగా ఉండటం, కరెన్సీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం వంటి అంశాల కారణంగా అక్కడికి ఎగుమతుల్లో మందగమనం కొనసాగే అవకాశం ఉంది‘ అని పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)