Breaking News

సీక్రెట్‌గా సెకండ్‌ జాబ్‌.. 15 ఏళ్ల జైలు శిక్ష

Published on Thu, 10/23/2025 - 13:16

ఏకకాలంలో రెండు ఉద్యోగాలు చేస్తున్న భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని ‘గ్రాండ్‌ లార్సెనీ’ (పెద్ద మొత్తంలో దొంగతనం) అభియోగాలపై అమెరికా అధికారులు అరెస్టు చేశారు. న్యూయార్క్ స్టేట్ ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్‌లో రిమోట్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల మెహుల్ గోస్వామిపై మాల్టా పట్టణంలో రెండవ ఉద్యోగం చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారుల నిధులలో 50,000 డాలర్లకు పైగా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నాన్‌ బెయిలబుల్ క్లాస్ సి నేరానికి ఇతను 15 సంవత్సరాల వరకు జైలు శిక్షను ఎదుర్కొంటున్నాడు.

మెహుల్ గోస్వామిపై అభియోగాలు ఇవే..

మెహుల్ గోస్వామి 2022 మార్చిలో మాల్టాలోని గ్లోబల్ ఫౌండ్రీస్ కోసం కాంట్రాక్టర్ గా రెండవ ఉద్యోగంలో పనిచేయడం ప్రారంభించాడు. సరటోగా కౌంటీ షెరీఫ్ కార్యాలయం ప్రకారం.. గోస్వామి న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే సెమీకండక్టర్ సంస్థలో రెండో ఉద్యోగం చేశాడు.

"ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్రతతో పని చేసే బాధ్యతను అప్పగించారు. కానీ గోస్వామి ఆ బాధ్యతను తీవ్రంగా ఉల్లంఘించారు" అని న్యూయార్క్ స్టేట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ లూసీ లాంగ్ పేర్కొన్నారు.

"ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకుంటూ రెండవ, పూర్తికాల ఉద్యోగం చేయడం పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో సహా ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే" అని లాంగ్ స్పష్టం చేశారు.

15 ఏళ్ల జైలు శిక్ష

సెకండ్ డిగ్రీ గ్రాండ్ లార్సెనీ ఆరోపణలపై గోస్వామికి దాదాపు పదేళ్ల జైలు శిక్ష పడుతోంది. న్యూయార్క్ రాష్ట్రంలో, ఈ రకమైన నేరానికి గరిష్ట జైలు శిక్ష 15 సంవత్సరాలు. మాల్టా టౌన్ కోర్టులో గోస్వామిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా సొంత పూచికత్తుపై విడుదల చేసి తదుపరి విచారణలు చేపట్టారు. న్యూయార్క్ రాష్ట్ర చట్టం ప్రకారం, ఈ అభియోగం 2020 జనవరి నాటికి బెయిల్‌కు అర్హత కలిగిన నేరం కాదు.

ఇదీ చదవండి: అమెజాన్‌లో 6 లక్షల ఉద్యోగాలు గాన్‌?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)