కొత్తవారికే కోటిన్నర జీతం.. కానీ ఒక్కటే కండీషన్‌..

Published on Mon, 09/01/2025 - 15:50

ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్లకు భారీగా కోటిన్నర జీతమిస్తానంటున్నారు అమెరికాకు చెందిన భారత సంతతి పారిశ్రామికవేత్త దక్ష్ గుప్తా. కానీ ఆయన పెట్టిన కండీషన్‌ ఒక్కటే. అదేంటంటే తన స్టార్టప్‌లో ఉద్యోగంలోకి చేరేవాళ్లు వారానికి ఆరు రోజులు, రోజుకు 12-14 గంటలు (9-9-6 rule) పనిచేయాలి.

శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ప్రారంభించిన గ్రెప్టైల్‌ అనే స్టార్టప్ లో పలు ఉద్యోగావకాశాలను దక్ష్ గుప్తా ఇటీవల ప్రకటించారు. ఆయన ప్రకటించిన జీతం బాగానే ఉన్నా రోజుకు అన్నేసి గంటలు పనిచేయాలనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా 14 గంటల పని అభిప్రాయంపై ఆయన వెనక్కి తగ్గడం లేదు.

సిలికాన్ వ్యాలీలో చాలా మంది ప్రొఫెషనల్స్‌  వారానికి ఆరు రోజులు.. రోజుకు 12 గంటల షిఫ్టులను ఇష్టపూర్వకంగా చేస్తున్నారని గ్రెప్టైల్ ఫౌండర్‌ దక్ష్ గుప్తా వాదిస్తూనే ఉన్నారు. ఇప్పటి యువతరం వినోదం కంటే క్రమశిక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారని ‘శాన్ ఫ్రాన్సిస్కో స్టాండర్డ్’ వార్తా సంస్థతో జరిగిన సంభాషణలో పేర్కొన్నారు. తన కంపెనీలో జరుగుతున్న పనుల వేగాన్ని ఆయన ఇదివరకే రాకెట్ ప్రయోగంతో పోల్చారు.

ఎంట్రీ లెవల్లో, గ్రెప్టైల్‌లోని ఉద్యోగులు సంవత్సరానికి 140,000 నుండి  180,000 డాలర్లు (సుమారు రూ .1.2–1.5 కోట్లు) మధ్య బేస్‌ వేతనం పొందవచ్చు. అదనంగా 130,000 నుంంచి 180,000  డాలర్ల విలువైన ఈక్విటీలను పొందవచ్చు. అదే ఏడేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్స్‌కు అయితే బేస్ వేతనం ఏడాదికి 2,40,000 డాలర్ల నుంచి 2,70,000 డాలర్ల వరకు ఉంటుంది.

అయితే అన్నీ ఫుల్‌ టైమ్‌ ఆఫీసు ఉద్యోగాలు. అంటే రిమోట్ వర్క్‌ (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) అవకాశమే ఉండదు. తప్పనిసరిగా ఆఫీస్‌కు వచ్చే పనిచేయాలి. ఇక కాంప్లిమెంటరీ మీల్స్, ట్రాన్స్‌స్పోర్ట్ ఫెసిలిటీస్, హెల్త్‌కేర్ కవర్, 401కే కాంట్రిబ్యూషన్ మ్యాచ్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)