Breaking News

బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ ఫండ్స్‌కు డిమాండ్‌ 

Published on Thu, 07/03/2025 - 05:25

న్యూఢిల్లీ: బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలకు మంచి డిమాండ్‌ నెలకొంది. ఈ విభాగంలో సుమారు 22 మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు సేవలు అందిస్తున్నాయి. వీటి నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏడాది కాలంలో 37 శాతం వృద్ధితో రూ.48,000 కోట్లకు చేరుకున్నాయి. 2024 మే చివరికి వీటి నిర్వహణ ఆస్తులు రూ.34,971 కోట్లుగా ఉండడం గమనార్హం. 

ఈ విభాగంలోని పథకాలు మంచి పనితీరు చూపించడం ఏయూఎంలో బలమైన వృద్ధికి కారమైనట్టు తెలుస్తోంది. ఈ పథకాలు గత ఏడాది కాలంలో పెట్టుబడులపై 22 శాతం నుంచి 30 శాతం వరకు రాబడులను అందించడం గమనార్హం. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగం పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న దీర్ఘకాల విశ్వాసానికి నిదర్శనంగా దీన్ని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీఎస్‌ఈ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండెక్స్‌ 14 శాతం పెరగ్గా.. ఇదే కాలంలో ప్రధాన సూచీ సెన్సెక్స్‌ పెరుగుదల 10 శాతంగానే ఉంది. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో బీమా, ఫిన్‌టెక్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌గా రుణాలు అందించే అన్‌లిస్టెడ్‌ కంపెనీల్లోనూ ఈ తరహా ఫండ్స్‌ పెట్టుబడులు పెడుతుండడం ఇన్వెస్టర్లు ఆకర్షిస్తోంది. ‘‘ఆర్థిక వ్యవస్థ సంఘటితంగా మారుతుండడం, రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం విస్తరిస్తుండడంతో ఈ విభాగంలో బలమైన కంపెనీల సంఖ్య పెరుగుతోంది. దీంతో దీర్ఘకాలంలో మంచి పెట్టుబడుల అవకాశాలను ఈ రంగం ఆఫర్‌ చేస్తోంది’’అని వెల్త్‌ మేనేజర్‌ అల్ఫాషా పేర్కొన్నారు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)