Breaking News

స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల సొమ్ము మూడింతలు

Published on Fri, 06/20/2025 - 05:44

న్యూఢిల్లీ/జ్యురిచ్‌: స్విస్‌ బ్యాంకుల్లోని భారతీయుల నిధులు (డిపాజిట్లు, సెక్యూరిటీలు సహా) మూడింతలకు పైగా పెరిగి 2024 చివరికి 3.5 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్స్‌కు (రూ.37,600 కోట్లు) చేరాయి. 2021 తర్వాత స్వివ్స్‌ బ్యాంకుల్లో భారత నిధులు గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్లీ ఇదే కావడం గమనార్హం. 2021లో ఈ మొత్తం 3.83 స్విస్‌ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. ఈ వివరాలను స్విస్‌ నేషనల్‌ బ్యాంక్‌ (ఎస్‌ఎన్‌బీ) గురువారం విడుదల చేసింది. 

బ్యాంక్‌ ఛానళ్లు, ఇతర ఆర్థిక సంస్థల రూపంలో జమ అయిన నిధులు ఇవి. ఇక స్విస్‌ బ్యాంకుల్లోని భారత క్లయింట్ల ఖాతాల్లోని డిపాజిట్లు 11 శాతం పెరిగి 346 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ (రూ.3,675 కోట్లు)గా ఉన్నాయి. మొత్తం నిధుల్లో క్లయింట్ల ఖాతాల్లో ఉన్నవి 10 శాతమేనని తెలుస్తోంది. విడిగా చూస్తే.. 3.02 బిలియన్ల స్విస్‌ ఫ్రాంక్స్‌ ఇతర బ్యాంకుల రూపంలో ఉంటే, 346 మిలియన్ల ఫ్రాంక్స్‌ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లో ఉన్నాయి. 

41 మిలియన్లు ఫిడూషియరీలు లేదా ట్రస్ట్‌ల రూపంలో, 135 మిలియన్ల ఫ్రాంక్స్‌ బాండ్లు, ఇతర సెక్యూరిటీల రూపంలో ఉన్నట్టు ఎస్‌ఎన్‌బీ వెల్లడించింది. నిజానికి స్విస్‌ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 2023లో 70 శాతం క్షీణించి 1.04 ఫ్రాంక్స్‌గా ఉండడం గమనార్హం. ఆ తర్వాత రెండేళ్లలో ఇవి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తోంది. అయినప్పటికీ, 2026లో స్విస్‌ బ్యాంకుల్లోని భారతీయుల డిపాజిట్లు 6.5 బిలియన్ల ఫ్రాంక్స్‌ కంటే తక్కువే. బ్యాంకులు అందించిన సమాచారంగా ఎస్‌ఎన్‌బీ విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇందులో నల్లధనం వివరాల్లేవు. అలాగే, ఏ సంస్థల పేరు మీద ఖాతాలున్నాయనే వివరాలను కూడా వెల్లడించలేదు.  

నల్లధనంగా చూడరాదు.. 
భారతీయులు స్విట్జర్లాండ్‌లో కలిగి ఉన్న ఆస్తులను ‘నల్లధనం’గా పరిగణించకూడదన్నది స్విస్‌ అధికారుల వాదన. ‘‘పన్ను మోసాలు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత్‌ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్‌ మద్దతుగా నిలుస్తుంది. 2018 నుంచి భారతీయుల డిపాజిట్ల వివరాలను ఆటోమేటిక్‌ ఎక్సే్ఛంజ్‌ మార్గంలో అందజేస్తున్నాం. మొదటిగా 2019లో డేటా బదిలీ చేయగా.. అప్పటి నుంచి ఏటా ఇది కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అవకతవకలకు సంబంధించి అనుమానం ఉన్న ఖాతాల వివరాలు కూడా అందిస్తూనే ఉన్నాం’’అని స్విస్‌ అధికారులు తెలిపారు.

 ఇక స్విస్‌ బ్యాంకుల్లో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు 2024లో 977 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌కు తగ్గాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 983 బిలియన్‌ ఫ్రాంక్స్‌గా ఉన్నాయి. స్విస్‌ బ్యాంకుల్లో ఉన్న విదేశీ ఫండ్స్‌లో దేశాల వారీగా చూస్తే భారత్‌ 48వ స్థానంలో ఉంది. గతేడాది 67వ స్థానం నుంచి పుంజుకుంది. అంతర్జాతీయంగా చూస్తే స్విస్‌ బ్యాంకుల్లోని విదేశీ క్లయింట్ల నిధుల్లో 222 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ యూకే నుంచే ఉండడం గమనార్హం. 89 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ యూఎస్, 68 బిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్స్‌ వెస్టిండీస్‌ క్లయింట్లకు చెందినవి. పాకిస్థాన్‌ క్లయింట్లకు సంబంధించి 272 మిలియన్‌ ఫ్రాంక్స్, బంగ్లాదేశ్‌ క్లయింట్లకు సంబంధించి 589 మిలియన్‌ ఫ్రాంక్స్‌ కూడా ఉన్నాయి.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)