Breaking News

దేశంలో సంపద.. సంపన్నులు రెట్టింపు

Published on Thu, 06/26/2025 - 13:42

దేశంలో సంపద పెరుగుతోంది. సంపన్నులు రెట్టింపవుతన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) తాజా నివేదిక ప్రకారం.. 2024-2029 మధ్య అంటే ఐదేళ్లలో  మిలియనీర్ల జనాభా 55 శాతానికిపైగా పెరుగుతుందని అంచనా. ఇది ప్రపంచ సగటు 21 శాతం కంటే రెట్టింపు.

2023-2024 మధ్య కాలంలో భారత ఆర్థిక సంపద 10.8 శాతం పెరిగిందని, ఆసియా-పసిఫిక్ (ఏపీఏసీ) సగటు 7.3 శాతం దాటిందని బీసీజీ తెలిపింది. ఉత్తర అమెరికా (4%), పశ్చిమ ఐరోపా (5%) లను మించి ఎఆసియా-పసిఫిక్ ప్రాంతం 2029 నాటికి వార్షికంగా 9% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

2024 నుంచి 2029 వరకు డాలర్ మిలియనీర్ల సంఖ్య 55 శాతానికి పైగా పెరుగుతుందని అంచనా వేస్తున్నామని బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, పార్టనర్ మయాంక్ ఝా తెలిపారు. తొలి తరం మొదటిసారి సంపద సృష్టికర్తలు, ముఖ్యంగా మిలీనియల్‌ (యువ) పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ లీడర్లు పరిశ్రమను పునర్నిస్తున్నారని పేర్కొన్నారు.

బలమైన ఈక్విటీ మార్కెట్ పనితీరు కారణంగా ఆర్థిక ఆస్తులు 8.1% పెరగడంతో 2024లో ఆర్థిక సంపద రికార్డు స్థాయిలో 305 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని బీసీజీ గ్లోబల్ నివేదిక తెలిపింది. విలువైన క్లయింట్ల గుర్తింపు, ప్రాధాన్యంలో సంస్థలకు సహకారం అందిస్తూ ఉత్పాదక ‌ఏఐ (GenAI) సంపద ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తుందని వివరించింది. ఈ ఉత్పాదక ‌ఏఐని త్వరగా అందిపుచ్చుకున్నవారు ఐదు రెట్లు అధికంగా పురోగమిస్తున్నారని వివరించింది.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)