Breaking News

ఏటా రూ.20 లక్షలు సంపాదన.. ఇల్లు కొనలేని స్థితి

Published on Sat, 06/07/2025 - 12:24

ఏడాదికి రూ.20 లక్షలు సంపాదించే ఓ వ్యక్తి ఇప్పటికీ అపార్ట్‌మెంట్‌ కొనలేని స్థితిలో ఉన్నాడని చేసిన పోస్ట్ దేశంలోని వివిధ నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలపై చర్చకు దారితీసింది. నెలకు అన్ని ఖర్చులు పోను రూ.1.2 లక్షలు మిగులుతున్నా తన మిత్రుడు తాను ఉంటున్న నగరంలో ఒక ఇంటిని కొనులేని పరిస్థితిలో ఉన్నాడని ఒక వక్తి చేసిన పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఎక్స్(గతంలో ట్విటర్‌) వేదికగా అఖిలేశ్‌ అనే వ్యక్తి పోస్ట్‌ చేస్తూ..‘గుర​్‌గావ్‌లోని నా స్నేహితుడు ఏటా రూ.20 లక్షల సీటీసీ వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పన్నులు, ఈపీఎఫ్, మినహాయింపులు తర్వాత నెలకు రూ.1.2 లక్షలు మిగులు ఉంటుంది. తాను వస్తువుల కొనుగోళ్లలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోడు. కారు లేదు. పిల్లలు లేరు. తాను, తన భార్య మాత్రమే ఉంటున్నారు. ఇళ్లు కొందామని ప్రయత్నిస్తున్నాడు. కానీ తాను వెళ్తున్న ప్రతి ప్రాజెక్టులో అపార్ట్‌మెంట్‌ విలువ రూ.2.5 కోట్లతో ప్రారంభమవుతుంది. ఇన్ఫినిటీ పూల్స్, జెన్ గార్డెన్స్, ఇటాలియన్ మార్బుల్, బయోమెట్రిక్ లిఫ్టుల గురించి బ్రోచర్లలో ఊదరగొడుతున్నారు. దీన్ని కొనుగోలు చేస్తే కేవలం జీతం కోసం బతకాల్సి ఉంటుంది. బఫర్ మనీ ఉండదు. సెలవులు ఉండవు. ఎమర్జెన్సీ ఉండదు’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఒకటో తేదీ వచ్చిందంటే వణుకు

‘నా స్నేహితుడు దేశంలో చాలామంది ఉద్యోగులు సంపాదించే దానికంటే కొంత మెరుగ్గానే సంపాదిస్తున్నాడు. కానీ ఇప్పటికీ తాను నివసిస్తున్న నగరంలో ఇల్లు కొనలేని పరిస్థితులు ఉన్నాయి. రియల్డీ మార్కెట్‌ వేరే వారికోసం సరిగ్గా డిజైన్ చేసిన విధంగానే పనిచేస్తోంది’ అని తెలిపారు. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘రియల్టీ వ్యాపారం పెరుగుతోందా..? జీతాలు తగ్గుతున్నాయో అర్థం కావడం లేదు’ అని ఒకరు రిప్లై ఇచ్చారు. గుర్‌గావ్‌ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)