Breaking News

ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది!

Published on Mon, 07/06/2026 - 14:03

జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లే అభ్యర్థులు సాధారణంగా అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగితే ఎలా స్పందించాలి? అనే విషయంపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. ఇలాంటి సంఘటనే ఒక ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్‌కు ఎదురైంది. దీంతో అతడు ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చింది.

కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గోగ్నా ఇటీవల తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

కరణ్ గోగ్నా ఓ యూజ్డ్ కార్ల స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలోని అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేశారు. హెచ్‌ఆర్ ఆయన డాక్యుమెంట్లను తీసుకోవడంతో.. ఉద్యోగం దాదాపు ఖాయమైందని భావించారు. అయితే.. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు కంపెనీ సీఈఓతో ఒక చివరి సమావేశం ఏర్పాటు చేశారు.

సీఈఓతో సమావేశం బాగా జరిగిందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం కలిగిందని కరణ్ తెలిపారు. చివర్లో సీఈఓ ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగారు. దానికి కరణ్, ''మీ కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించాలని ఆలోచిస్తోందా?'' అని ప్రశ్నించారు.

అయితే.. సీఈఓ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ''మీ అభిప్రాయం ఏమిటి? మేం ఆ మార్కెట్‌లోకి వెళ్లాలా?'' అని తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురవుతుందని ఊహించని కరణ్ ''కంపెనీ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేశానని, కానీ టూ-వీలర్ మార్కెట్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు''. దీంతో ఆ సమయంలో తడబడి స్పష్టతలేని సమాధానం ఇచ్చానని అంగీకరించారు.

మరుసటి రోజు హెచ్‌ఆర్ నుంచి ఫోన్ వచ్చి, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కరణ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ''ఇంటర్వ్యూకు వెళ్లేవారు సమాధానాల కోసం ఎంత సిద్ధమవుతారో, చివర్లో అడిగే ప్రశ్నల కోసం కూడా అంతే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు''.

ఎందుకంటే అభ్యర్థి అడిగే చివరి ప్రశ్న, అతని ఆలోచనా విధానం, వ్యాపార అవగాహన, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూవర్‌కు తెలియజేసే చివరి అవకాశం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు.

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)