Breaking News

తప్పతాగి.. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన!

Published on Mon, 04/24/2023 - 21:43

న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది.

ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని  ఢిల్లీ పోలీసులు తెలిపారు.

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్‌ చేశారు. 

వరుసగా మూడోసారి
గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)