లాభాల్లో దూసుకెళ్లిన టాటా గ్రూప్‌ కంపెనీ

Published on Fri, 11/08/2024 - 11:54

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ సంస్థ ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఐహెచ్‌సీఎల్‌) సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి పటిష్ట పనితీరు చూపించింది. లాభం మూడు రెట్లు పెరిగి రూ.583 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.179 కోట్లుగానే ఉంది.

విమానయాన, సంస్థాగత కేటరింగ్‌ సేవల విభాగం ‘తాజ్‌శాట్స్‌’ స్థిరీకరణతో ఏకీకృత ఆర్జన (రూ.307కోట్లు) తోడు కావడం లాభంలో అధిక వృద్ధికి దారితీసింది. ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే రూ.1,433 కోట్ల నుంచి రూ.1,826 కోట్లకు పెరిగింది. వ్యయాలు సైతం రూ.1,249 కోట్ల నుంచి రూ.1,502 కోట్లకు పెరిగాయి.

‘‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ త్రైమాసికంలో డిమాండ్‌ బలంగా పుంజుకుంది. దీంతో ఆదాయం 28 శాతం పెరిగింది. హోటల్‌ విభాగంలో ఆదాయం 16 శాతం వృద్ధి చెందింది. దీంతో క్యూ2లో ఇప్పటి వరకు అత్యుత్తమ ఎబిట్డా మార్జిన్‌ 29.9 శాతం నమోదైంది’’అని ఐహెచ్‌సీఎల్‌ ఎండీ, సీఈవో పునీత్‌ ఛత్వాల్‌ తెలిపారు. 2024–25 సంవత్సరానికి రెండంకెల ఆదాయ వృద్ధి అంచనాలను కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఢిల్లీలోని ల్యాండ్‌మార్క్‌ హోటల్‌ ‘క్లారిడ్జ్‌’ను 2025 ఏప్రిల్‌లో స్వాధీనం చేసుకోనున్నట్టు తెలిపారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)