Breaking News

జర్మనీ నుంచి టెస్లా దిగుమతులు!

Published on Thu, 11/09/2023 - 05:09

న్యూఢిల్లీ: జర్మనీ ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకోవడం ద్వారా భారత మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా భావిస్తోంది. చైనాలోనూ ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ ఆ దేశంతో నెలకొన్న ఉద్రిక్తతలరీత్యా అక్కణ్నుంచి దిగుమతులపై భారత్‌ అంత సుముఖంగా లేకపోవడంతో టెస్లా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా నుంచి కార్లను దిగుమతి చేసుకోవద్దంటూ టెస్లా టాప్‌ మేనేజ్‌మెంట్‌కు కేంద్ర ప్రభుత్వ శాఖలు సూచించినట్లు వివరించాయి.

దీంతో భారత్‌తో సత్సంబంధాలున్న జర్మనీ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. జర్మనీలోని బ్రాండెన్‌బర్గ్‌లో టెస్లాకు గిగాఫ్యాక్టరీ ఉంది. భారత మార్కెట్లో 25,000 యూరోల (సుమారు రూ. 20 లక్షలు) కారును ప్రవేశపెట్టే యోచనలో కంపెనీ ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, జర్మనీ నుంచి దిగుమతి చేసే విద్యుత్‌ వాహనాలపై కస్టమ్స్‌ సుంకాల నుంచి మినహాయింపులు ఇవ్వాలని కూడా టెస్లా కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఒకవేళ వాటిపై సుంకాలను 20–30 శాతం మేర తగ్గిస్తే టెస్లా మాత్రమే కాకుండా జర్మనీ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే మెర్సిడెస్, బీఎండబ్ల్యూ, ఆడి వంటి పలు లగ్జరీ కార్ల తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం లభించవచ్చని పేర్కొన్నాయి.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు