Breaking News

నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?

Published on Thu, 01/11/2024 - 13:23

రానున్న నాలుగేళ్లల్లో భారత్‌ జీడీపీ ఐదు ట్రిలియన్‌ డాలర్లకు(దాదాపు రూ.400 లక్షల కోట్లు) చేరి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్‌ పాల్గొని మాట్లాడారు.

ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15 కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందినట్లు మంత్రి తెలిపారు.

2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలు మనకన్నా ముందున్నాయన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా 7.2 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.

ఇదీ చదవండి: యూట్యూబ్‌కు కేంద్ర సంస్థ సమన్లు.. విస్తుపోయే కారణం..

గడిచిన 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని.. ఈ ఎఫ్‌డీఐలో 65శాతం అంటే 595 బిలియన్‌ డాలర్లు గత 8-9 ఏళ్లలో వచ్చినవేనని తెలిపారు. బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)