Breaking News

అమెరికాలో ఇండియా సరుకులు.. చుక్కలు చూపిస్తున్నాయ్‌..

Published on Sun, 08/24/2025 - 20:21

అమెరికాలో భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్‌లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్‌లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఓ భారతీయ యువకుడు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న ఓ వాల్‌మార్ట్ స్టోర్‌లో అందుబాటులో ఉన్న భారతీయ ఆహార ఉత్పత్తులను, వాటి ధరలను చూపిస్తూ రజత్‌ అనే ఓ భారతీయుడు  వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. రాయల్ లెంటిల్స్‌, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, వివిధ మసాలా దినుసులు, సాస్‌లు వంటి ప్రసిద్ధ వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో రజత్ వివరించారు.

డల్లాస్‌లో భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. అందుకే ఆ స్టోర్‌లో భారతీయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుతారని రజత్‌ చెప్పారు. పప్పు, నామ్కీన్, బిస్కెట్ల వంటి వస్తువుల ధరలు 4 డాలర్ల నుండి 4.5 డాలర్ల వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ వీడియో చూసిన యూజర్లు వస్తువుల ధరలు చూసి నోరెళ్లబెట్టారు. ఇండియాలో వాటి ధరలు.. అమెరికాలోని ఆ స్టోర్‌లో వాటి రేట్లు తెలుసుకుని వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఓ యూజరైతే ‘హైడ్‌ అండ్‌ సీక్‌ బిస్కెట్లు 4 డాలర్లా? అంటే రూ.320. అది ఇండియాలో రూ.20 లకే వస్తుంది’ అంటూ కామెంట్‌ చేశారు.

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)