Breaking News

మళ్లీ తెరపైకి పని గంటల వివాదం: నెటిజన్లు ఫైర్!

Published on Tue, 09/16/2025 - 15:04

వారానికి 72 గంటల పని వాదనలు సద్దుమణిగాయి అనుకునేలోపే.. మళ్లీ ఈ వివాదం తెరమీదకు వచ్చింది. ఏఐ స్టార్టప్ మెర్కోర్‌లో పనిచేస్తున్న భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. వారానికి 72 నుంచి100 గంటలు పనిచేసిన తన అనుభవాన్ని పంచుకున్న తర్వాత ఇది చర్చకు దారితీసింది.

మైక్రోసాఫ్ట్ మాజీ ఉద్యోగి ప్రణవ్ మెహతా.. అన్ని కాలాలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని అభివర్ణిస్తూ, వారానికి 72 గంటల పని అంటే మొదట్లో కొంత భయంగా అనిపించవచ్చు. అప్పుడప్పుడు ఇది 100 గంటలకు కూడా విస్తరిస్తుందని పేర్కొన్నాడు. వారానికి 40 గంటల పని, అనుకున్న లాభాలను అందించదని అన్నారు. మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ చేసిన పోస్ట్‌కు ప్రతిస్పందనగా మెహతా ఈ వ్యాఖ్యలు చేశారు.

మెర్కోర్ సీఈఓ బ్రెండన్ ఫుడీ.. కంపెనీ ఆదాయం 17 నెలల్లోనే 1 నుంచి 500 మిలియన్లకు పెరిగింది. దీనిని ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ అని పేర్కొన్నాడు. కంపెనీ ఇప్పుడు 10 బిలియన్ డాలర్ల విలువను లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి: విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ఆహ్వానం

వారానికి 72 గంటల పనిపై ప్రణవ్ మెహతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకతకు దారితీశాయి. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు అధిక పని గంటలను కీర్తించడాన్ని విమర్శించారు. ఇంత ఎక్కువ గంటలు పనిచేయడం వెనుక ఉన్న మనస్తత్వాన్ని ఒకరు ప్రశ్నించగా.. ఎక్కువ పనిగంటలు వల్ల తలెత్తే ఇబ్బందులను గురించి పట్టించుకోరా, మీ ఉద్దేశం ఏమిటి? అని మరొకరు అన్నారు.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)