Breaking News

మూడేళ్లలో జర్మనీ, జపాన్‌ను అధిగమిస్తాం 

Published on Sun, 04/20/2025 - 03:12

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే మూడేళ్లలో జర్మనీ, జపాన్‌లను అధిగమిస్తుందనని నీతి ఆయోగ్‌ సీఈవో బీవీఆర్‌ సుబ్రమణ్యం అన్నారు. 2047 నాటికి 30 ట్రిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచానికి విద్యా కేంద్రంగా భారత్‌ ఎదుగుతుందన్నారు. మిగతావన్నీ పక్కన పెడితే, భారత్‌కు ఉన్న అతిపెద్ద సానుకూలత ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు.

 ‘‘ప్రస్తుతం భారత్‌ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. వచ్చే ఏడాది చివరికి నాలుగో స్థానానికి చేరుకుంటాం. ఆ తర్వాతి సంవత్సరంలో మూడో స్థానాన్ని సాధిస్తాం’’అని సుబ్రమణ్యం చెప్పారు. ఐఎంఎఫ్‌ తాజా డేటా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. భారత కంపెనీలు, న్యాయ సేవల సంస్థలు, అకౌంటింగ్‌ సంస్థలు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే ఆకాంక్షలతో పనిచేయాలని సుబ్రమణ్యం పిలుపునిచ్చారు. 

తక్కువ ఆదాయ దేశాల్లోని సమస్యలతో పోల్చితే మధ్యాదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవిగా పేర్కొన్నారు. ప్రపంచానికి పనిచేసే కారి్మక శక్తిని భారత్‌ అందిస్తున్నట్టు చెప్పారు. జపాన్‌ 15వేల మంది భారత నర్సులను తీసుకుంటే, జర్మనీ 20వేల మంది హెల్త్‌కేర్‌ సిబ్బందిని నియమించుకున్నట్టు గుర్తు చేశారు. వారిదగ్గర కుటుంబ వ్యవస్థ ముక్కలైనట్టు వ్యాఖ్యానించారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)