వంట గదుల్లో నలభీములు!

Published on Sat, 10/04/2025 - 04:53

ముంబైలోని చిన్న వంటగదిలో 29 ఏళ్ల జస్టిన్‌ వారంలో ఒక రాత్రి తన ఎయిర్‌ ఫ్రయర్‌లో స్వీట్‌ పోటాటో వెజెస్‌ వేయిస్తూ, సలాడ్‌ సిద్ధం చేస్తుంటాడు.  వంట అనేది అతనికి విసుగెత్తించే పనికాదు, రిలాక్స్‌ అవడానికి, స్నేహితులను ఎంటర్‌టైన్‌ చేయడానికి, కొత్త రుచులను అన్వేíÙంచడానికి అదో మార్గం. జస్టిన్‌ ఇప్పుడు  భారతదేశ నగరాల్లో పెరుగుతున్న ఒక వర్గానికి ప్రతినిధి. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది పురుషులు స్టైలిష్‌ గాడ్జెట్లు, ఆధునిక కుక్‌వేర్‌తో వంటింట్లోకి అడుగుపెడుతున్నారు. ఇది మారుతున్న అలవాట్లకే కాదు వాణిజ్యపరంగా కూడా ఒక విప్లవం. 

దృక్పథం మారుతోంది...
ఆన్‌లైన్లో వంటింటి సామాను కొనేవారిలో ఇపుడు  30% మంది పురుషులే ఉంటున్నారు  ఐదారేళ్ల క్రితం ఇది చాలా తక్కువ శాతం మాత్రమే. ఇంట్లో వంటగది ఎలా ఉండాలి, కుకింగ్‌ త్వరగా అయేందుకు ఏమేం వస్తువులు కొనాలి అనే నిర్ణయాన్నిఇపుడు అనేక ఇళ్లలో  భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకుంటున్నారని  స్టాల్‌ కిచెన్స్‌ సీఈఓ ధ్రువ్‌ అగర్వాల్‌ తెలిపారు.వంటింటి సామ్రాజ్యానికి ఇప్పటికీ మహిళలే మహారాణులైనా పురుషుల వాటాకూడా క్రమంగా పెరుగుతోందని వండర్‌ చెఫ్‌ వ్యవస్థాపకుడు రవి సక్సేనా స్పష్టంచేశారు. 

70% వారానికోసారి...
ఆన్‌లైన్‌ కొనుగోళ్ల ఆల్గరిథమ్‌ను పరిశీలిస్తే వంటింటి సామాను కొనే పురుషులు రెండు రకాలని తెలుస్తోంది. మొదటిరకం.. స్వతంత్రంగా జీవించే యువకులు వీరు రోజువారీ వాడుకకు పనికివచ్చే, నాన్‌–టాక్సిక్‌ కుక్‌వేర్, ఒకటి రెండు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఇక రెండో రకం ప్యాషనేట్‌ కుక్స్‌ (బిజీ ప్రొఫెషనల్స్‌) వీరు ప్రతిరోజూ వంట చేయకపోయినా, ప్రీమియం సెట్‌లు కొనుగోలు చేసి సంప్రదాయ కుటుంబ వంటకాలతోపాటు  రెస్టారెంట్‌లో లభించే రుచులను  వంటింట్లో తయారుచేసేందుకు ప్రయతి్నస్తారు. 

కుక్‌వేర్‌ కొనే పురుషుల్లో 70% మంది కనీసం వారానికి ఒకసారి వాటిని వాడతారు. వీరు ఎక్కువగా ప్రీమియం ఉత్పత్తులు,  పూర్తి సెట్‌లను కొనడానికి ఇష్టపడతారు. వీరి సగటు ఆర్డర్‌ విలువ ఇతరులతో పోలిస్తే 12% ఎక్కువని ఎంబర్‌ కుక్‌వేర్‌ సీఈఓ సిద్ధార్థ్‌ గడోదియా  చెప్పారు. పురుషులకు బాగా నచ్చేవి, ఎక్కువగా కొనే కిచెన్‌ ఉత్పత్తులు  మలీ్ట–ఫంక్షనల్‌ పరికరాలు (కలపడం, ముద్ద చేయడం, కట్‌ చేయడం, ఆవిరి వేయడం, వండడం ఇలా ఆల్‌ రౌండర్‌ టైపువి.  స్టీలు పెనాలు, మూకుళ్లు ఉంటాయని గడోదియా తెలిపారు. మొత్తానికి, పురుషులు వంటింట్లోకి అడుగుపెట్టడం వల్ల కుక్‌వేర్‌ మార్కెట్‌కి కొత్త కళ వచి్చంది.

పురుషులు వంటగదిలోకి రావడానికి కారణాలు
→ ఆరోగ్యంపై శ్రద్ధ (తక్కువ నూనె, ప్రాసెస్‌ చేసిన ఆహారం తగ్గించడం) 
→ ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ ప్యాటర్న్స్‌ (హోమ్‌ ఆఫీస్, వర్క్‌–లైఫ్‌ బ్యాలెన్స్‌) 
→ సోషల్‌ మీడియాలో నోరూరిస్తూ లభించే సులభమైన రెసిపీలు

#

Tags : 1

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)