Breaking News

ఖరీదైన వస్తువులు పోతున్నాయ్.. ఆందోళనలో భారతీయ సీఈఓలు

Published on Thu, 02/08/2024 - 14:24

యూకే షాడో ఫారిన్ సెక్రటరీ డేవిడ్ లామీ, భారతీయ వ్యాపారవేత్తల మధ్య జరిగిన సమావేశంలో.. లండన్‌లో రోలెక్స్ వాచ్ దొంగతనాల అంశాన్ని ప్రస్తావించారు. సమావేశాలకు లేదా వ్యాపార అవసరాల నిమిత్తం లండన్ వెళ్లినప్పుడు తమవెంట ఖరీదైన వస్తువులు కూడా తీసుకెళ్తారు. అలాంటి వస్తువులు దొంగతనానికి గురైనట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమావేశంలో వెల్లడించారు.

లగ్జరీ వాచ్‌లు, మొబైల్స్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగులు సైతం దొంగలిస్తున్నారని పలు కంపెనీల సీఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. 2022తో పోలిస్తే.. గతేడాది దొంగతనాలు భారీగా పెరిగిపోయాయి. 2023లో దొంగతనాలు ఏకంగా 27 శాతం పెరిగినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.

2022లో 52 వేల దొంగతనాలు నమోదవగా, 2023లో 72 వేల కేసులు నమోదైనట్లు మెట్రోపాలిటన్‌ పోలీసులు వెల్లడించారు. గత ఐదేళ్లలో లండన్‌లో దాదాపు 29,000 వాచీ దొంగతనాలు జరిగినట్లు సమాచారం. ఈ ఏడాది జాతీయ ఎన్నికలకు ముందు బ్రిటన్‌లో పెరుగుతున్న నేరాలు ఇప్పుడు రాజకీయ సమస్యగా మారాయి.

ఇదీ చదవండి: 'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే..

లండన్ పర్యటనకు వచ్చినప్పుడు భద్రత లేకపోతే మేము ఎందుకు రావాలని సీఈఓలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలి, బ్రిటన్ ప్రభుత్వం మా ఇబ్బందులను గుర్తించాలని వ్యాపారవేత్తలు వెల్లడించారు. ఈ దొంగతనాలను తగ్గించడానికి లండన్ పోలీసులు అండర్‌కవర్‌ ఆపరేషన్‌ నిర్వహించి తగ్గించడానికి పూనుకున్నట్లు కూడా అధికారులు తెలిపారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)