Breaking News

కారు కొనడానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్ - వీడియో

Published on Sat, 05/24/2025 - 18:23

గత రెండు దశాబ్దాలలో భారతదేశంలో ధనవంతులైన వ్యాపారవేత్తల సంఖ్య పెరిగింది. వారిలో చాలామంది భారతదేశంలో స్థిరపడ్డారు, మరికొందరు వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లారు. వ్యాపారవేత్తల జీవన విధానం చాలా విలాసవంతంగా ఉంటుంది. కాబట్టి వీరు రోజువారీ వినియోగానికి సైతం ఖరీదైన కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ కారు కొనుగోలు చేయడానికి ఏకంగా హెలికాఫ్టర్‌లో వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.

కేరళలోని మలప్పురంలో ఉన్న ఫ్రాగ్రెన్స్ వరల్డ్ కంపెనీ ఓనర్.. 'మూసా హాజీ' హెలికాప్టర్‌లో వచ్చి.. బెంట్లీ బెంటాయెగా డెలివరీ తీసుకున్నారు. కారును మూసా హాజీ స్వయంగా డ్రైవ్ చేస్తుండగా.. కాన్వాయ్‌లో రేంజ్ రోవర్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వంటి కార్లు కదిలాయి.

ఇక్కడ కనిపించే బెంట్లీ కారు ఈడబ్ల్యుబీ వెర్షన్ అని తెలుస్తోంది. రోజ్ గోల్డ్ షేడ్‌లో పూర్తయిన ఈ కారు ధర రూ.6 కోట్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.

ఇదీ చదవండి: శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్: నెలకు రూ.840 కంటే తక్కువే..

బెంట్లీ బెంటయెగా ఈడబ్ల్యుబీ వెర్షన్ వీ8 పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులోని 4.0 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజిన్‌.. గరిష్టంగా 550 పీఎస్ పవర్, 770 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఈ కారు అంబానీ ఫ్యామిలీ దగ్గర కూడా ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)