Breaking News

Shombi Sharp: ప్రపంచానికి భారత్‌ అవసరం

Published on Fri, 01/12/2024 - 00:31

న్యూఢిల్లీ: సామాజిక అంశాలపై పెట్టుబడుల పరంగా భారత్‌ కంపెనీలు ముందున్నందున ప్రపంచానికి భారత్‌ అవసరం ఎంతో ఉందని ఐక్యరాజ్యసమితి భారత రెసిడెంట్‌ కోర్డినేటర్‌ శొంబిషార్ప్‌ పేర్కొన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో వ్యాపారాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఢిల్లీలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌)పై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శొంబి మాట్లాడారు.

భారత ప్రయాణంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత అనివార్యమంటూ.. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడానికి చేస్తున్న ప్రయత్నాలలో వ్యాపారాలు ముందున్నట్టు చెప్పారు. సీఎస్‌ఆర్‌ విషయంలో, భారత్‌ ప్రపంచాన్ని నడిపిస్తున్నట్టు తెలిపారు.

‘‘ప్రపంచంలో సగానికి సగం దేశాలు విద్య, ఆరోగ్యం కంటే తమ అప్పులు తీర్చడానికే ఎక్కువ కేటాయింపులు చేయాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. ఇటీవలి జీ20 సదస్సు సందర్భంగా భారత్‌ నాయకత్వ పాత్ర పోషించింది’’అని శొంబి పేర్కొన్నారు. కంపెనీల చట్టంలోని నిబంధనల ప్రకారం లాభాల్లోని కంపెనీలు క్రితం మూడేళ్ల కాలంలోని సగటు లాభాల నుంచి 2 శాతాన్ని సామాజిక కార్యక్రమాల కోసం (సీఎస్‌ఆర్‌) వ్యయం చేయాల్సి ఉంటుంది.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)