ప్లేన్‌ క్రాష్‌.. బిలియనీర్ కుటుంబంలో తీవ్ర విషాదం.. ఒక్కరూ మిగల్లేదు!

Published on Mon, 10/02/2023 - 15:27

జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదం భారత్‌కు చెందిన మైనింగ్‌ దిగ్గజం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో వారి ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురు వ్యక్తులలో ఒక భారతీయ బిలియనీర్, ఆయన కుమారుడు ఉన్నట్లు స్థానిక మీడియా నివేదికల ద్వారా తెలిసింది. 

బంగారం, బొగ్గుతోపాటు నికెల్, రాగిని వెలికితీసి శుద్ధి చేసే ‘రియోజిమ్’ అనే డైవర్సిఫైడ్ మైనింగ్ కంపెనీ యజమాని హర్పాల్ రంధావా, ఆయన కొడుకుతో పాటు మరో నలుగురు మషావా, ఐహరారేలోని జ్వామహండే ప్రాంతంలో విమానం కూలిపోవడంతో మృతిచెందినట్లు జింబాబ్వేకు చెందిన ఓ న్యూస్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

తమ వజ్రాల గని వద్దే ప్రమాదం
రియోజిమ్‌ కంపెనీకి చెందిన ‘సెస్నా 206’ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ కంపెనీకి చెందిన చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలోనే  ఈ సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోవడం గమనార్హం.

ఒక్కరూ మిగల్లేదు..
జ్వామహండే ప్రాంతంలోని పీటర్ ఫామ్‌లోకి దూసుకెళ్లే ముందు విమానం సాంకేతిక లోపం తలెత్తినట్లుగా తెలుస్తోంది. గాల్లోనే విమానం పేలిపోయినట్లు భావిస్తున్నారు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక పేర్కొంది.

మృతుల్లో నలుగురు విదేశీయులు కాగా, మిగిలిన ఇద్దరు జింబాబ్వే దేశీయులు అని పోలీసులను ఉటంకిస్తూ ప్రభుత్వ యాజమాన్యంలోని దినపత్రిక హెరాల్డ్ పేర్కొంది. మృతుల పేర్లను పోలీసులు ఇంకా విడుదల చేయలేదు. అయితే రంధావా స్నేహితుడైన పాత్రికేయుడు, చిత్రనిర్మాత హోప్‌వెల్ చినోనో ఆయన మరణాన్ని ధ్రవీకరించారు. రంధావా 4 బిలియన్‌ డాలర్ల (రూ.33 వేల కోట్లకు పైగా) ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్‌ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)