Breaking News

రూ.1,16,200 కోట్లకు వాహన విడిభాగాల విపణి

Published on Mon, 02/05/2024 - 01:55

న్యూఢిల్లీ: వాహన విక్రయానంతర విడిభాగాల మార్కెట్‌ దేశీయంగా 2028 నాటికి రూ.1,16,200 కోట్లకు చేరుకుంటుందని ఒక నివేదిక వెల్లడించింది. వాహన విక్రయాల్లో భారీ వృద్ధి ఇందుకు కారణమని తెలిపింది. 2023లో ఇది రూ.83,000 కోట్లు ఉంది. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ భాగస్వామ్యంతో ఆటోమోటివ్‌ కంపోనెంట్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏసీఎంఏ) ఈ నివేదిక రూపొందించింది.

‘ప్రస్తుతం భారతీయ రోడ్లపై 34 కోట్ల వాహనాలు పరుగెడుతున్నాయి. ఈ సంఖ్య వచ్చే అయిదేళ్లలో ఏటా వార్షిక సగటు వృద్ధి 8 శాతం నమోదు కానుంది. 2028 నాటికి ద్విచక్ర వాహనాలు 25.7 కోట్ల నుంచి 36.5 కోట్లకు, ప్యాసింజర్‌ వాహనాలు 4.7 కోట్ల నుంచి 7.2 కోట్లకు చేరనున్నాయి. ప్రీ–ఓన్డ్‌ కార్ల విక్రయాల సగటు వృద్ధి 2027–28 నాటికి ఏటా 17.5 శాతం ఉంటుంది. వాణిజ్య వాహనాల సంఖ్య 1.3 కోట్ల నుంచి 1.9 కోట్లను తాకనుంది.

ట్రాక్టర్లు 1.4 కోట్ల నుంచి 1.9 కోట్లకు చేరనున్నాయి. ఇక్కడి కంపెనీలకు టాప్‌–10 అంతర్జాతీయ మార్కెట్లకు రూ.2,90,500 కోట్ల విలువైన ఎగుమతి అవకాశాలు లభిస్తాయి. ఇంజన్, సస్పెన్షన్, బ్రేకింగ్, ట్రాన్స్‌మిషన్‌ పార్ట్స్, రబ్బర్‌ విడిభాగాలు, కూలింగ్‌ సిస్టమ్స్, ఫిల్టర్స్‌కు ప్రధానంగా డిమాండ్‌ ఉంటుంది’ అని నివేదిక వివరించింది. టైర్లు, లూబ్రికెంట్స్, కూలెంట్స్, బ్యాటరీలను నివేదికలో పొందుపర్చలేదు.  

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)