Breaking News

ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా భారత్.. నితిన్ గడ్కరీ

Published on Thu, 12/12/2024 - 19:48

వచ్చే ఐదేళ్లలో భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ.. ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ రంగంలో అమెరికా, చైనాలను సైతం అవలీలగా దాటేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో లాజిస్టిక్స్ ఖర్చులు లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.

అమెజాన్ సంభవ్ సమ్మిట్‌ (Amazon Smbhav Summit)లో గడ్కరీ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన వృద్ధిని సాధించింది. తాను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7 లక్షల కోట్ల నుంచి రూ.22 లక్షల కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం రూ. 78 లక్షల కోట్లతో అమెరికా అగ్రస్థానంలో ఉంది, తరువాత స్థానంలో చైనా (రూ. 47 లక్షల కోట్లు) ఉంది. భారత్ మూడో స్థానంలో (రూ. 22 లక్షల కోట్లు) ఉంది. కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమను ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలనీ, తప్పకుండా అవుతుందని గడ్కరీ అన్నారు.

ఇదీ చదవండి: టాప్ 5 బడ్జెట్ కార్లు: ధర తక్కువ.. ఎక్కువ కంఫర్ట్

భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చులను 2 సంవత్సరాలలోపు సింగిల్ డిజిట్‌కు తగ్గించాలనే మంత్రిత్వ శాఖ లక్ష్యాన్ని గడ్కరీ వివరించారు. మన దేశంలో లాజిస్టిక్ ధర 16 శాతం ఉంది, ఇది చైనాలో 8 శాతం, అమెరికా & యూరోపియన్ దేశాలలో ఇది 12 శాతంగా ఉంది. కాబట్టి భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడాలంటే లాజిస్టిక్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య