Breaking News

రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు

Published on Thu, 06/15/2023 - 15:26

విలాసవంతమైన టవర్స్‌; లగ్జరీ భవనాలు, ఎత్తైన శిఖరాలకు పెట్టింది పేరైన దుబాయ్‌లో రియల్ ఎస్టేట్‌కున్న డిమాండ్‌ మామూలుది కాదు. వెర్సైల్స్‌ను తలపించే మార్బుల్‌ ప్యాలెస్ ధర వింటే షాక్‌వుతారు. మార్కెట్‌లో దీని ధర  రూ. 1,600 కోట్లు  (750 మిలియన్ దిర్హామ్‌ల) పలుకుతోంది. విలాసవంతమైన భవనాలు ఎక్కువగా ఉండే నగరంలో మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ఇల్లు అమ్మకానికి వుంది. ఇలాంటి ఇంద్రభవనంపై మోజుపడుతున్నవారిలో భారతీయుడు ఉండటం విశేషం. 

మార్బుల్ ప్యాలెస్ అదిరిపోయే ఫీచర్లు
రియల్ ఎస్టేట్ ఏజెంట్లచే "మార్బుల్ ప్యాలెస్"  గా పిలుస్తున్న  ఈ భవనాన్ని  అతి ఖరీదైన ఇటాలియన్ మార్బుల్ స్టోన్‌తో నిర్మించారు.  Luxhabitat Sotheby's International Realty విక్రయిస్తున్న ఈ భవన నిర్మాణం దాదాపు 12 సంవత్సరాలు పట్టిందట. 60వేల చదరపు అడుగుల ఇంటిలో ఐదు బెడ్‌రూమ్‌లు ఉంటాయి. ఇందులో మాస్టర్ బెడ్‌రూమ్ 4,000 చదరపు అడుగులు ఒక పెద్ద  భవనాన్ని  మించిఅన్నమాట. (ఫేస్‌బుక్‌ మూత పడనుందా? కోర్టు సంచలన వ్యాఖ్యలు)

ఇంకా 15-కార్ల గ్యారేజ్, 19 రెస్ట్‌రూమ్‌లు, ఇండోర్ అలాగే అవుట్‌డోర్ పూల్స్, రెండు రూఫ్‌లు, 80,000 లీటర్ (21,000 గాలన్లు) కోరల్ రీఫ్ అక్వేరియం, ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎమర్జెన్సీ రూమ్‌లు తదితర ఫీచర్లలో ఉన్నాయి. ఇది 70 వేల చదరపు అడుగుల స్థలంలో గోల్ఫ్ కోర్స్‌కి ఎదురుగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. (అపుడు పాల ప్యాకెట్‌ కొనలేక పాట్లు, ఇపుడు 800 కోట్ల ఆస్తులు!)

ఈ ఆస్తిని ఎవరైనా కొనుక్కెవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు,  లేదా  టెన్నిస్ లేదా పాడెల్ బాల్ కోర్ట్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు. బ్రోకర్ కునాల్ సింగ్. ఈయన అంచనా ప్రకారం, కేవలం ఐదు నుండి పది మంది సంపన్నులు దీన్ని కొనుగోలు చేయగలరు. అంతేకాదు గత మూడు వారాల్లో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఇంటిని చూశారు. ఇందులో రష్యాకు చెందిన కొనుగోలు ప్రతినిధి ఒకరు కాగా, రెండో కస్టమర్ ఎమిరేట్స్ హిల్స్‌లో ఇప్పటికే మూడు నివాసాలను కలిగి ఉన్న ఇండియన్‌ కావడం గమనార్హం.  ఆయన భార్య ఇంకొంచెం మెరుగైన దాని కోసం చూస్తోందని అందుకే నిర్ణయం తీసుకోలేదని సింగ్ పేర్కొన్నాడు.

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)