825 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు 

Published on Thu, 06/12/2025 - 06:36

బెర్న్‌: ప్రపంచ వాణిజ్యం భౌగోళిక రాజకీయంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని.. అయినా భారత్‌ 2025–26లో 825 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను (రూ.70.12 లక్షల కోట్లు) సాధిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌–హమాస్‌ పోరు, రెడ్‌సీ సంక్షోభాలను ప్రస్తావించారు. సవాళ్లతో కూడిన సందర్భాల్లో భారత్‌ విజేతగా నిలిచినట్టు గుర్తు చేశారు. 

ప్రతికూల పరిస్థితుల్లోనూ 2024–25లో భారత్‌ 825 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను నమోదు చేసినట్టు చెప్పారు. కొన్ని సంస్థల అంచనాల ప్రకారం అంతర్జాతీయ వాణిజ్యం క్షీణతను చవిచూడనుందని మంత్రి చెప్పారు. భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్‌ఐఈవో) మాత్రం 2025–26లో ఎగుమతులు 21 శాతం పెరిగి ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటాయని అంచనా వేసింది. 

అంతర్జాతీయంగా ఆర్థిక అనిశి్చతులు పెరిగిపోయిన తరుణంలో కొనుగోలుదారులు తమ సోర్సింగ్‌ (ముడి సరుకుల సమీకరణ)ను వైవిధ్యం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుండడం వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్‌ ఎస్‌సీ రల్హన్‌ తెలిపారు. ఎఫ్‌ఐఈవో అంచనా మేరకు 2025–26లో వస్తు ఎగుమతులు 12 శాతం పెరిగి 525–535 బిలియన్‌ డాలర్లుగా ఉండనున్నాయి. 2024–25లో వస్తు ఎగుమతులు 437 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. సేవల గుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 387 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఇవి 20 శాతం పెరిగి 465–475 బిలియన్‌ డాలర్లకు చేరుకోచ్చన్నది ఎఫ్‌ఐఈవో అంచనా.  

ఎఫ్‌టీఏలతో సానుకూలత 
యూఏఈ, ఆ్రస్టేలియా, ఐరోపా ఫ్రీ ట్రేడ్‌ అసోసియేషన్‌ (ఈఎఫ్‌టీఏ)తో భారత్‌ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) ఎగుమతుల వృద్ధికి అనుకూలిస్తుందని ఎఫ్‌ఐఈవో అంచనా వేస్తోంది. ఇందులో ఈఎఫ్‌టీఏతో ఒప్పందం ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. కాంగ్రెస్‌ పాలనలో కుదిరిన ఎఫ్‌టీఏలు దేశీ సంస్థలకు నష్టం చేసినట్టు వాణిజ్య మంత్రి గోయల్‌ అన్నారు. పోటీ దేశాలైన ఆసియా దేశాలతో ఒప్పందాలు చేసుకోగా, అవి కూడా సమతుల్యంగా లేనట్టు చెప్పారు. ఆయా దేశాలకు భారత్‌ మార్కెట్‌ అవకాశాలు కలి్పంచగా, బదులుగా మనకు మంచి అవకాశాలు దక్కలేదన్నారు. మోదీ సర్కారు మాత్రం అభివృద్ధి చెందిన దేశాలైన ఆ్రస్టేలియా, యూకే, ఈఎఫ్‌టీఏ, ఈయూ, యూఏఈ, ఒమన్‌ తదితర దేశాలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు చెప్పారు. 

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)