Breaking News

ఇకపై ఎఫ్‌డీఐలు పుంజుకుంటాయ్‌

Published on Fri, 01/06/2023 - 06:29

న్యూఢిల్లీ: గ్లోబల్‌ అనిశ్చితుల నేపథ్యలోనూ రానున్న కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పుంజుకోనున్నట్లు వాణిజ్యం, పరిశ్రమల శాఖ తాజాగా అంచనా వేసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో పెట్టుబడులు, ఈక్విటీలకు నిధులు తరలి వస్తుంటాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి మన్మీత్‌ కె.నందా పేర్కొన్నారు.

కాగా.. ఈ ఏడాది(2022–23) తొలి అర్ధభాగం(ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో ఎఫ్‌డీఐ ఈక్విటీ నిధులు 14 శాతం క్షీణించి 26.9 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. డీపీఐఐటీ గణాంకాల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులు, రాబడులను తిరిగి ఇన్వెస్ట్‌ చేయడం, ఇతర మూలధనం కలసిన మొత్తం ఎఫ్‌డీఐలు సైతం ఈ కాలంలో 9 శాతం నీరసించి 39 బిలియన్‌ డాలర్లకు చేరాయి. గతేడాది(2021–22) తొలి అర్ధభాగంలో ఇవి 42.86 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ మందగమనం కారణంగా 18 నెలలుగా విదేశీ పెట్టుబడులపై ప్రభావం పడుతున్నట్లు మన్మీత్‌ తెలియజేశారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఇండియా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఇకపై ఊపందుకునే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)