Breaking News

ఆగస్టులో హైరింగ్‌ 3 శాతం అప్‌..

Published on Tue, 09/02/2025 - 05:11

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా వైట్‌–కాలర్‌ జాబ్‌ మార్కెట్‌ వార్షిక ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందింది. ప్రదానంగా ఐటీయేతర రంగాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) ఉద్యోగాలకు డిమాండ్‌ నెలకొన్నట్లు నౌకరీ జాబ్‌స్పీక్‌ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్స్, మేనేజర్లు, అడ్మిని్రస్టేషన్‌ ఉద్యోగాలను వైట్‌ కాలర్‌ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు.

 నివేదిక ప్రకారం ఆగస్టులో అత్యధికంగా 24 శాతం హైరింగ్‌తో బీమా రంగం అగ్రస్థానంలో నిలి్చంది. ఆతిథ్య (22 శాతం), రియల్‌ ఎస్టేట్‌ (18 శాతం) రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీపీవో/ఐటీఈఎస్‌ (17 శాతం), విద్య (16 శాతం), ఆయిల్‌..గ్యాస్‌ (7 శాతం), రిటైల్‌ (3 శాతం), ఎఫ్‌ఎంసీజీ (2 శాతం) రంగాల్లో కూడా సానుకూల హైరింగ్‌ నమోదైంది. రిపోర్టులో మరిన్ని విశేషాలు.. 

→ కొత్త టెక్నాలజీల్లో నిపుణులకు డిమాండ్‌ నెలకొనడంతో ఏఐ/ఎంఎల్‌ ఉద్యోగాలకు హైరింగ్‌ 54 శాతం ఎగిసింది. అయితే, ఓవరాల్‌గా ఐటీ/సాఫ్ట్‌వేర్‌ సరీ్వసుల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గాయి. 

→ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సరీ్వసుల విభాగంలో హైరింగ్‌ 11 శాతం, టెలికం/ఐఎస్‌పీలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. 

→ ఫ్రెషర్ల (0–3 ఏళ్ల అనుభవం) రిక్రూట్‌మెంట్‌ 7 శాతం పెరిగింది. ఆతిథ్య, రియల్‌ ఎస్టేట్, విద్య తదితర ఐటీయేతర రంగాల్లో డిమాండ్‌ ఇందుకు తోడ్పడింది. 

→ ఓవరాల్‌గా 10 శాతం హైరింగ్‌ వృద్ధితో నియామకాలకు సంబంధించి హైదరాబాద్‌ టాప్‌ మెట్రో సిటీగా నిలి్చంది. యూనికార్న్‌లలో (1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే అంకురాలు) రిక్రూట్‌మెంట్‌ 45 శాతం ఎగిసింది.   
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)