Breaking News

భారత్‌కు ‘వాణిజ్య లోటు’ భయాలు!

Published on Tue, 12/17/2024 - 05:06

న్యూఢిల్లీ: భారత్‌కు వాణిజ్యలోటు  సవాళ్లు తలెత్తుతున్నాయి. ఎగుమతులు నవంబర్‌లో అసలు పెరగకపోగా, 4.85 శాతం క్షీణించి (2023 ఇదే నెలతో పోల్చి) 32.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఎగుమతులు భారీగా 27 శాతం పెరిగి 69.95 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఆల్‌టైమ్‌ హై 32.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వంట నూనెలు, ఎరువులు, పసిడి వెండి దిగుమతులు భారీగా పెరగడం మొత్తం వాణిజ్యలోటు తీవ్రతకు దారితీసిందని వాణిజ్య మంత్రిత్వశాఖ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. 

→ పసిడి దిగుమతుల విలువ ఆల్‌టైమ్‌ హై 14.8 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2023 నవంబర్‌లో ఈ విలువ 3.5 బిలియన్‌ డాలర్లు.  
→ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు సమీక్షా నెల్లో 7.9 శాతం పెరిగి 16.11 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  
→ పెట్రోలియం ప్రొడక్టుల దిగుమతులు 50 శాతం తగ్గి, 3.71 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.  
→ జౌళి, ఇంజనీరింగ్‌ గూడ్స్, ఎల్రక్టానిక్స్, ఫార్మా, సుగంధ ద్రవ్యాల ఎగుమతులు బాగున్నాయి.  

ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య ఇలా.. 
ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య ఎగుమతులు 2.17 శాతం పెరిగి 284.31గా నమోదయ్యాయి. దిగుమతులు 8.35 శాతం పెరిగి 486.73 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దీనితో వాణిజ్యలోటు 202.42 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 170.98 బిలియన్‌ డాలర్లు. కాగా, ఎనిమిది నెలల్లో పసిడి దిగుమతులు 49 శాతం పెరిగి 49 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి.  

సేవల రంగం ఇలా.. 
నవంబర్‌లో సేవల ఎగుమతుల విలువ గత ఏడాది ఇదే కాలంతో పోలి్చతే 28.11 బిలియన్‌ డాలర్ల నుంచి 35.67 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)