Breaking News

వణికిస్తున్న వాణిజ్యలోటు

Published on Thu, 05/16/2024 - 07:48

న్యూఢిల్లీ: భారత్‌ వస్తు ఎగుమతులు–దిగుమతుల విలువల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు ఏప్రిల్‌లో ఆందోళన కలిగించింది. తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, సమీక్షా నెల్లో ఎగుమతుల విలువ కేవలం ఒక శాతం పెరిగి (2023 ఇదే నెలతో పోల్చి) 35 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. దిగుమతుల విలువ ఇదే కాలంలో 10.25 శాతం ఎగసి 54.09 బిలియన్‌ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 19.1 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గడచిన నాలుగు నెలల్లో ఈ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. 

కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... 
⇒ ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, పెట్రోలియం ప్రొడక్టులు, ఫార్మా ఎగుమతులు బాగున్నాయి.  
⇒ విలువైన మెటల్స్‌ దిగుమతులు రెట్టింపై 3.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. 
⇒ క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతులు 20.22% పెరిగి 16.5 బిలియన్‌ డాలర్లుకు ఎగసింది.  
⇒ 30 కీలక రంగాల్లో 13 వస్తు ఎగుమతుల్లో పెరుగుదలను నమోదుచేశాయి. వీటిలో కాఫీ, పొగాకు, సుగంధ ద్రవ్యాలు, ప్లాస్టిక్, హస్తకళలు ఉన్నాయి.

2023–24లో రికార్డు 
మార్చితో ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతుల మొత్తం విలువ 778.21 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. ఇది ఒక రికార్డు. ఇందులో వస్తు ఎగుమతులు 437.1 బిలియన్‌ డాలర్లు. సేవల ఎగుమతుల విలువ 341.1 బిలియన్‌ డాలర్లు.  

సేవలు ఇలా... 
తొలి అంచనాల ప్రకారం ఏప్రిల్‌లో సేవల ఎగుమతులు 29.57 బిలియన్‌ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 25.78 బిలియన్‌ డాలర్లు. దిగుమతుల విలువ 16.97 బిలియన్‌ డాలర్లు. 2023 ఇదే నెల్లో ఈ విలువ 13.96 బిలియన్‌ డాలర్లు.  

ఎగుమతుల వృద్ధి కొనసాగుతుంది.. 
అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ కొత్త ఆర్థిక సంవత్సరం కొంత సానుకూలంగానే ప్రారంభమైంది.  ఎగుమతుల వృద్ధి కొనసాగుతుందని భావిస్తున్నాం.      
– సునిల్‌ భరత్వాల్, వాణిజ్య కార్యదర్శి 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)