Breaking News

60 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి!

Published on Wed, 09/30/2026 - 00:11

న్యూఢిల్లీ: దేశీయంగా ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాలను భారీగా పెంచుకోవడంపై కేంద్రం దృష్టి పెట్టింది. 2047 నాటికి 60.4 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని భావిస్తోంది. ఇందుకోసం దిగుమతులపరమైన సవాళ్లను పరిష్కరిస్తూ, పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంపొందించడంపై ఫోకస్‌ చేస్తోంది. దీనికి సంబంధించి కొత్త జాతీయ ఉక్కు విధానంపై (ఎన్‌ఎస్‌పీ) కసరత్తు జరుగుతోందని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ తెలిపారు.

సంబంధిత వర్గాల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు వారం రోజుల్లో ఎన్‌ఎస్‌పీని బహిరంగపర్చనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ప్రస్తుతం భారత్‌ ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం సుమారు 22 కోట్ల టన్నులు. ఉత్పత్తి పెంపునకు, అలాగే అందులో స్పెషల్‌ స్టీల్, వేల్యూ యాడెడ్‌ ఉక్కు వాటాను పెంచేందుకు ఉపయోగపడే ప్రణాళిక ఎన్‌ఎస్‌పీలో ఉండనుంది. 

ఎంఎస్‌ఎంఈలకు రూ.5,000 కోట్లతో పథకం
కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా కార్యకలాపాలను నిర్వహించుకునేలా చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఈ) ఉక్కు యూనిట్లను ప్రోత్సహించేందుకు ’వికసిత్‌ భారత్‌ ఇస్పాత్‌’ పేరిట రూ. 5,000 కోట్లతో ప్రోత్సాహక పథకాన్ని కూడా రూపొందిస్తున్నట్లు సందీప్‌ తెలిపారు. పెద్ద సంస్థల కోసం త్వరలోనే సీసీటీఎస్‌ (కార్బన్‌ క్రెడిట్‌ ట్రేడింగ్‌ స్కీమ్‌)ను ప్రకటించనున్నట్లు వివరించారు. నాణ్యత లేని చౌక దిగుమతులను కట్టడి చేస్తూ, దేశీయ పరిశ్రమకు రక్షణ కల్పించేలా సేఫ్‌గార్డ్‌ డ్యూటీ, యాంటీ డంపింగ్‌ డ్యూటీ మొదలైనవన్నీ కొత్త పాలసీలో ఉంటాయని పేర్కొన్నారు.

 కాగా, ఎగుమతుల రంగంలో పోటీతత్వమనేది విదేశీ మారకాన్ని ఆర్జించడానికే కాకుండా ఉపాధి కల్పన, తయారీ సామర్థ్యాలను పెంపు, కొత్త ఆవిష్కరణలకు తోడ్పడుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) డైరెక్టర్‌ జనరల్‌ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి, సరఫరా వ్యవస్థలో అడ్డంకులు, ప్రపంచ దేశాల రక్షణాత్మక వైఖరుల మధ్య కూడా భారత్‌ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌ మధ్య 11% వృద్ధి చెందాయని చెప్పారు. 
 

Videos

Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..

TDP నేతల కంటే ఎక్కువ తిరుగుతున్నాడు మజ్జి శ్రీనుకు ఇచ్చిపడేసిన పేర్ని కిట్టు

పడిపోతున్న బంగారం ధరలు కొనాలా? వద్దా?

ఇప్పటికీ నా భార్య తిడతా ఉంది.. పేర్ని నాని నాన్ స్టాప్ సెటైర్లు

నిరసన చేస్తున్న లాయర్లను ఈడ్చిపడేసిన పోలీసులు

నాని మేడారం మొక్కులు

నీకు ఎన్ని బూతులు వచ్చో నాకు అంతకంటే ఎక్కువే వచ్చు.. నాని స్వీట్ వార్నింగ్

ఎవరా పోలీసులు.. గుర్తించండి..! మహినికలి MLAల ఘుటనపై హైకోర్టు సీరియస్

CHATGPTతో తిరుమల రూమ్ బుకింగ్... పేమెంట్ దశ వరకు వెళ్లి..!

గుంటూరులో ఘోర విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Photos

+5

YS జగన్‌ కోసం కదిలిన ఒంగోలు.. పోటెత్తిన అభిమానులు! (ఫొటోలు)

+5

మిస్‌ ఎర్త్‌ వాటర్‌ ఇండియాగా ఆదిలాబాద్ యువ‌తి (ఫొటోలు)

+5

‘తత్వం’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

మేడారం వనదేవతల సన్నిధిలో నాని (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు నవీన్ చంద్ర (ఫొటోలు)

+5

ఫేమస్ దేవాలయాలన్నీ తిరిగేస్తున్న 'జైలర్' భామ (ఫొటోలు)

+5

హ్యాపీ బర్త్ డే క్యూటీ.. భర్తకు ఆలియా భట్ లవ్‌లీ విషెస్ (ఫొటోలు)

+5

ప్రెగ్నెన్సీతోనూ జిమ్, గేమ్.. సమంత లేటెస్ట్ (ఫొటోలు)

+5

పెళ్లి వేడుక కోసం ముస్తాబైన హీరోయిన్ కళ్యాణి (ఫొటోలు)

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు