Breaking News

భారత్‌ కీలక నిర్ణయం.. ఆ దేశానికి పోస్టల్‌ సేవలు బంద్‌

Published on Sat, 08/23/2025 - 17:20

భారత్‌ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరులో అమల్లోకి రానున్న అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పులను ఉటంకిస్తూ ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ తాజాగా ప్రకటించింది. అనేక వస్తువులపై సుంకం మినహాయింపును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ నం.14324 ద్వారా 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు డ్యూటీ-ఫ్రీ మినహాయింపు తొలగించారు.  ట్రంప్ ఇటీవల భారత్‌పై 25 శాతం సుంకం విధించడంతో పాటు రష్యా చమురు కొనుగోలుకు అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. ఈ పరిణామాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి పోస్టల్ సేవలు  నిలిపివేసినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 29 నుంచి అమెరికాకు తరలించే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (ఐఈఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే 100 డాలర్ల వరకు విలువైన గిఫ్ట్ ఐటమ్స్ కు మాత్రం మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.

ఎయిర్ క్యారియర్లు తమకు అవసరమైన విధానాలు లేకపోవడంతో ఆగస్టు 25 తర్వాత పార్సిళ్లు తీసుకోలేమని భారత అధికారులకు తెలియజేశారు. దీంతో భారత పోస్టల్ శాఖ ఇప్పుడు  లెటర్లు/డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకూ విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రమే స్వీకరిస్తుంది.  ఇప్పటికే బుక్ చేసిన బట్వాడాకు వీలులేని వస్తువులకు రిఫండ్ పొందవచ్చని పోస్టల్‌ శాఖ తెలియజేసింది.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)