Breaking News

రష్యా చమురు దిగుమతుల్లో భారత్‌ స్థానం ఎంతంటే..

Published on Thu, 01/15/2026 - 10:42

అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో భారత్ వెనకబడింది. 2025 డిసెంబరు నాటికి భారత్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిందని యూరోపియన్ థింక్ ట్యాంక్ ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్’(CREA) తన తాజా నివేదికలో వెల్లడించింది.

గణాంకాలు ఇలా..

సీఆర్‌ఈఏ డేటా ప్రకారం, నవంబర్ నెలలో 3.3 బిలియన్ యూరోలుగా ఉన్న భారత రష్యన్ హైడ్రోకార్బన్ల దిగుమతులు డిసెంబరు నాటికి 2.3 బిలియన్ యూరోలకు తగ్గాయి. ఇదే సమయంలో టర్కీ 2.6 బిలియన్ యూరోల కొనుగోళ్లతో రెండో స్థానానికి చేరగా, చైనా 6 బిలియన్ యూరోల వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

డిసెంబరులో భారత్ దిగుమతుల వివరాలు

  • ముడి చమురు: 1.8 బిలియన్ యూరోలు (మొత్తం దిగుమతుల్లో 78%)

  • బొగ్గు: 424 మిలియన్ యూరోలు

  • చమురు ఉత్పత్తులు: 82 మిలియన్ యూరోలు

తగ్గుదలకు ప్రధాన కారణాలు

  • అమెరికా ఆంక్షల సెగ: ఉక్రెయిన్ యుద్ధానికి రష్యా నిధులను అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికాకు చెందిన ‘ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్’ (OFAC) చర్యలు చేపట్టింది. దాంతో రష్యాకు చెందిన ప్రధాన చమురు సంస్థలైన రోస్ నెఫ్ట్, లుకోయిల్‌పై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల భయంతో భారతీయ కంపెనీలు వెనక్కి తగ్గాయి.

  • రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యూహాత్మక నిర్ణయం: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (జామ్ నగర్), రష్యన్ ముడి చమురు వినియోగాన్ని ఏకంగా సగానికి (50%) తగ్గించింది. గతంలో రోస్ నెఫ్ట్ ద్వారా సరఫరా అయిన కార్గోలను మాత్రమే తీసుకున్న రిలయన్స్, కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇతర మార్గాలను వెతుక్కుంటోంది.

  • ప్రభుత్వ రంగ సంస్థల కోత: ప్రైవేట్ సంస్థలే కాకుండా, ప్రభుత్వ రంగ రిఫైనర్లు కూడా రష్యా నుంచి దిగుమతులను 15 శాతం వరకు తగ్గించుకున్నాయి. హెచ్‌పీసీఎల్‌(HPCL), మంగళూరు రిఫైనరీ (MRPL) వంటి సంస్థలు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) మాత్రం ఆంక్షలు లేని సంస్థల నుంచి మాత్రమే పరిమితంగా దిగుమతులు చేస్తోంది.

2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకే చమురు లభించడంతో భారత్ ఒక దశలో 35 శాతం వరకు రష్యాపైనే ఆధారపడింది. కానీ, ప్రస్తుత అంతర్జాతీయ ఒత్తిళ్లు, ఆంక్షల కారణంగా ఇది 25 శాతానికి పడిపోయింది. భారతదేశం తన ఇంధన భద్రత కోసం ఇప్పుడు ఇతర మిడిల్‌ఈస్ట్‌ దేశాల వైపు మొగ్గు చూపుతోంది.

ఇదీ చదవండి: వ్యాధి నిర్ధారణలో ఐసీఎంఆర్‌ కీలక ఆవిష్కరణ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)