Breaking News

సింగిల్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల జోరు 

Published on Sun, 06/15/2025 - 05:38

దేశీయంగా సింగిల్‌ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ చెయిన్లు గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. ఏటా 24 శాతం వృద్ధి రేటుతో 2028 నాటికి ఈ మార్కెట్‌ పరిమాణం 9 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుంది. ప్రస్తుతం ఇది 4 బిలియన్‌ డాలర్ల స్థాయిలో ఉంది.  20 శాతం పైగా ఎబిటా మార్జిన్లు, 30 శాతం పైగా ఆర్‌వోసీఈలు (పెట్టుబడిపై రాబడులు), రెండేళ్ల వ్యవధిలోనే బ్రేక్‌–ఈవెన్‌ సాధించే అవకాశాలు మొదలైనవి ఈ పరిశ్రమ వృద్ధికి దోహదపడనున్నాయి. ఎవెండస్‌ క్యాపిటల్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత దశాబ్దకాలంలో  ఈ సెగ్మెంట్‌ .. భారీ స్థాయిలో ప్రైవేట్‌ ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది.

 సుమారు 3.7 బిలియన్‌ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయి. హాస్పిటల్స్‌లోకి వచి్చన మొత్తం పెట్టుబడుల్లో ఇది సుమారు 35 శాతం. ఇలా వచి్చన పెట్టుబడుల్లో దాదాపు 70 శాతం భాగం ఐవీఎఫ్, ఐకేర్, తల్లి..బిడ్డ సంరక్షణ, డయాలిసిస్, ఆంకాలజీ వంటి స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు దోహదపడ్డాయి. గత మూడేళ్లుగా దంత సంరక్షణ, యూరాలజీ/నెఫ్రాలజీ, స్కిన్‌..హెయిర్‌ కేర్‌ వంటి స్పెషాలిటీ విభాగాల్లోని ప్రముఖ సంస్థల్లోకి కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. ఈ విభాగాల్లో     డిమాండ్‌–సరఫరా మధ్య భారీగా వ్యత్యాసం నెలకొనడం ఇందుకు కారణం.

కన్సాలిడేషన్‌కి అవకాశం.. 
న్యూఢిల్లీ: నివేదిక ప్రకారం తక్కువ స్థాయి పెట్టుబడి, నిర్దిష్టమైన సేవలకు పరిమితం కావడం తదితర అంశాల వల్ల ఈ విభాగం ఇటు ఇన్వెస్టర్లకు, అటు వ్యవస్థాపకులకు ఆకర్షణీయంగా ఉంటోంది. ఇక ఈ స్పెషాలిటీల్లో అగ్రగాములుగా ఉంటున్న సంస్థలు అధిక వృద్ధి సాధన కోసం ఇతర సంస్థలను విలీనం చేసుకోవడం, కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇందుకోసం కాస్త పెద్ద మొత్తాన్నే వెచి్చంచేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. పరిశ్రమలో కన్సాలిడేషన్‌ చోటు చేసుకునే అవకాశాలను ఇది సూచిస్తోంది.

మార్కెట్‌ క్యాప్‌ పెరుగుదల.. 
అగ్ర శ్రేణి సంస్థలు నిధుల సమీకరణ కోసం పబ్లిక్‌ మార్కెట్‌ వైపు చూస్తున్నాయి. దీనితో మరిన్ని కంపెనీలు స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్టింగ్‌ బాట పట్టనున్నాయి. వీటి సంఖ్య పెరిగే కొద్దీ లిస్టెడ్‌ సింగిల్‌ స్పెషాలిటీ చెయిన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ ప్రస్తుతమున్న 3.9 బిలియన్‌ డాలర్ల నుంచి 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 18 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటం, ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటం వంటి అంశాల వల్ల దేశీయంగా సింగిల్‌ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ విభాగంలో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

 పేషంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపర్చగలిగే సామర్థ్యాలు, సమర్ధవంతంగా కార్యకలాపాలను విస్తరించగలిగే వీలు, ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై మెరుగైన రాబడులను అందించే అవకాశం ఉండటం వల్ల ఈ విభాగం ఆకర్షణీయంగా ఉంటోందని ఎవెండస్‌ క్యాపిటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్షుల్‌ గుప్తా తెలిపారు. ప్రస్తుతం సింగిల్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ చెయిన్లు .. మెట్రోలు, ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమవుతున్నాయి. ద్వితీయ శ్రేణి మార్కెట్లలో అంతరాలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ఆ ప్రాంతాల్లో వృద్ధికి అవకాశం ఉందని గుప్తా చెప్పారు. క్రిత దశాబ్ద కాలంలో ఏ విధంగానైతే మలీ్ట–స్పెషాలిటీ విభాగం విస్తరించిందో అదే విధంగా పబ్లిక్‌ మార్కెట్లలో ఈ హాస్పిటల్స్‌ చెయిన్స్‌ లిస్టింగ్‌ సందడి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఆయా సంస్థలు పటిష్టమైన వ్యూహాలను సమర్ధవంతంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. సంపన్న దేశాల్లో ఈ తరహా మోడల్స్‌ విజయవంతమయ్యాయని గుప్తా చెప్పారు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి