Breaking News

వంటగ్యాస్ కష్టాలకు చెక్.. పెరిగిన ఉత్పత్తి!

Published on Tue, 03/24/2026 - 12:27

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు భారత ఇంధన దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ముఖ్యంగా దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ద్వారా సామాన్యుడిపై భారం పడకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పెరిగిన స్వదేశీ ఉత్పత్తి

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాకముందు వరకు భారతదేశ అవసరాల్లో స్వదేశీ ఎల్‌పీజీ ఉత్పత్తి వాటా 40% మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుత అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో దీన్ని 50-60%కి పెంచినట్లు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా గ్యాస్ కొరత ఏర్పడుతుందన్న భయంతో వినియోగదారులు అవసరం ఉన్నా, లేకపోయినా బుకింగ్స్ చేశారు. అయితే, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ నిలకడగా ఉందని, ఎక్కడా సరఫరా నిలిచిపోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో బుకింగ్స్ కూడా సాధారణ స్థితికి చేరుకున్నాయి. ‘మేము నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తున్నాం. దేశవ్యాప్తంగా సిలిండర్ల డెలివరీ సాధారణంగానే సాగుతోంది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని సుజాత శర్మ చెప్పారు.

ఇదీ చదవండి: ఢమాల్‌.. నేలకరిచిన పసిడి ధరలు

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)