Breaking News

పదేళ్లలో వేలకొద్దీ కిలోల బంగారం సీజ్‌.. ఆర్థిక శాఖ లెక్కలు చూస్తే..

Published on Sun, 08/24/2025 - 16:27

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసు­కున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్ల­డిం­చింది. 2015–16 నుంచి 2024–25 ఆర్థిక సంవ­త్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకు­న్నట్లు తెలిపింది.

ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023–24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం.. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 వరకు దేశవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్న కేసుల సంఖ్య 35,888కి చేరింది. మొత్తం 31,772.34 కిలోల బంగారం సీజ్‌ చేశారు. 2015–16లో 2,815 కేసులు నమోదు కాగా, 2,972.07 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2016–17లో కేసుల సంఖ్య 1,573కి తగ్గినా, 1,520.24 కిలోల బంగారం పట్టుబడింది. 2017–18లో 3,131 కేసులతో పాటు 3,329.46 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2018–19లో కేసులు 5,092కి పెరిగి, 4,292.29 కిలోల బంగారం సీజ్‌ చేశారు.

2019–20లో 4,784 కేసులు నమోదై 3,626.85 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2020–21లో కేసుల సంఖ్య 2,034కి తగ్గి, 1,944.39 కిలోల బంగారం మాత్రమే పట్టుబడింది. 2021–22లో 2,236 కేసులతో 2,172.11 కిలోల బంగారం స్వాధీనం కాగా, 2022–23లో కేసులు 4,619కి పెరిగి, 4,342.85 కిలోల బంగారం సీజ్‌ చేశారు. అత్యధికంగా 2023–24లో 6,599 కేసులు నమోదు కాగా, 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 2024–25లో కేసుల సంఖ్య 3,005గా ఉండగా, 2,600.40 కిలోల బంగారం స్వాధీనం చేశారు.

ఈ గణాంకాలు చూస్తే, కొన్ని సంవత్సరాల్లో కేసుల సంఖ్య తగ్గినా, బంగారం స్వాధీనం పరిమాణం ఎక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం. ఇది అక్రమ రవాణా మార్గాల్లో మార్పులు, తనిఖీల తీవ్రత, అంతర్జాతీయ ధరల ప్రభావం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి