Breaking News

సెప్టెంబర్‌లో రిజిస్టర్‌ అయిన టెస్లా, విన్‌ఫాస్ట్ ఈవీల సంఖ్య

Published on Fri, 10/03/2025 - 16:55

ప్రపంచంలోనే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లలో వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ ఈవీ తయారీదారుల్లో ఒకటైన టెస్లా, విన్‌ఫాస్ట్ ఇటీవలే భారత్‌లోకి ప్రవేశించాయి. గత నెలలో ఈ రెండు దిగ్గజ సంస్థలు తమ తొలి బ్యాచ్ వాహన రిజిస్ట్రేషన్లను నమోదు చేశాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వాహన్ (Vaahan) పోర్టల్ డేటా ప్రకారం సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 60 టెస్లా కార్లు, 6 విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి.

జులైలో భారతీయ కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత ఈ రెండు కంపెనీలకు ఇది మొదటి అధికారిక బ్యాచ్ రిజిస్ట్రేషన్లు కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ఈవీ మార్కెట్‌ను శాసిస్తున్న టెస్లా జులై 15న ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది. దీని మోడల్ వై ఎస్‌యూవీ ధరలు రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్‌కు రూ.59.89 లక్షలు, లాంగ్-రేంజ్ వేరియంట్ రూ.67.89 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. ఇది సుమారు 500 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

మరోవైపు వియత్నాం ఈవీ తయారీదారు విన్‌ఫాస్ట్ మిడ్-రేంజ్ మార్కెట్‌పై దృష్టి సారించింది. కంపెనీ ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించడమే కాకుండా స్థానిక తయారీకి భారీ పెట్టుబడిని ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడిలో నెలకొల్పిన విన్‌ఫాస్ట్ అసెంబ్లీ ప్లాంట్ ఆగస్టులో కార్యకలాపాలను మొదలుపెట్టింది. దీని ప్రారంభ సామర్థ్యం ఏటా 50,000 వాహనాలుగా ఉంది. దీనిని 1.5 లక్షల యూనిట్ల వరకు పెంచే అవకాశం ఉంది. 

ఇదీ చదవండి: సంద్రంలో వ్యక్తి ప్రాణాలు కాపాడిన యాపిల్‌ వాచ్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)