Breaking News

నాలుగు నెలల గరిష్టానికి ద్రవ్యోల్బణం 

Published on Sat, 01/13/2024 - 07:34

న్యూఢిల్లీ: రిటైల్‌ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టింది. కూరగాయాలు, పప్పులు, వంట దినుసుల ధరల మంటతో డిసెంబర్‌ మాసానికి 5.69%కి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి కావడం గమనించాలి. వినియోగ ధరల సూచీ (సీపీఐ/రిటైల్‌) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 నవంబర్‌ నెలలో 5.55%గా ఉంటే, 2022 డిసెంబర్‌ నెలకు 5.72%గా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది.

రిటైల్‌ ద్రవ్యోల్బణంలో సగం వాటా కలిగిన ఆహారోత్పత్తుల ధరలు (కూరగాయలతో కూడిన).. గతేడాది నవంబర్‌ నెలలో 8.7%గా ఉంటే, డిసెంబర్‌ నెలలో 9.53%కి పెరిగిపోయాయి. 2022 డిసెంబర్‌లో వీటి ధరలు సూచీలో 4.19% వద్దే ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83% గరిష్ట స్థాయిని తాకిన తర్వాత నుంచి కొంత తగ్గుతూ వచ్చింది. కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం 27.64%గా ఉంది. పప్పులకు సంబంధించి 20.73%, వంట దినుసుల ద్రవ్యోల్బణం 19.69% చొప్పున నమోదైంది. 

ఆహార విభాగంలోనే...
సీపీఐ ద్రవ్యోల్బణం త్రైమాసికం వారీగా పెరిగిపోవడం అన్నది ఆహారం, పానీయాల విభాగం వల్లేనని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్‌ పేర్కొన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గడం లేదంటే అదే స్థాయిలో కొసాగినట్టు తెలిపారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 4% స్థాయిలో (2 శాతం అటూ ఇటూ దాటకుండా) పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు