Breaking News

క్యూ4లో కరెంట్‌ ఖాతా మిగులు

Published on Sat, 06/28/2025 - 06:06

ముంబై: గత ఆర్థిక సంవత్సరం (2024–25) చివరి త్రైమాసికంలో (2025 జనవరి–మార్చి/క్యూ4) కరెంటు ఖాతా 13.5 బిలియన్‌ డాలర్ల (రూ.1.15 లక్షల కోట్లు) మిగులులోకి వచ్చినట్టు ఆర్‌బీఐ విడుదల చేసిన డేటా స్పష్టం చేస్తోంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం. 2023–24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరెంటు ఖాతా 4.6 బిలియన్‌ డాలర్ల మిగులుగా ఉండడం గమనార్హం.

 గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద చూస్తే కరెంటు ఖాతా లోటు 23.3 మిలియన్‌ డాలర్లుగా (జీడీపీలో 0.6 శాతం) ఉంది. 2023–24లో కరెంటు ఖాతా లోటు 26 బిలియన్‌ డాలర్లు (జీడీపీలో 0.7 శాతం) కావడం గమనించొచ్చు. వస్తువులకు సంబంధించి వాణిజ్య లోటు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 59.5 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 52 బిలియన్‌ డాలర్లుగానే ఉంది. సేవలకు సంబంధించి నికర మిగులు 53.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఇది 42.7 బిలియన్‌ డాలర్ల మేర ఉంది.  

బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ 
క్యూ4లో బిలియన్‌ డాలర్ల (రూ.8,400 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఎఫ్‌డీఐ 10.2 బిలియన్‌ డాలర్లతో పోలి్చచూస్తే గణనీయంగా తగ్గాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు క్యూ4 లో నికరంగా 5.9 బిలియన్‌ డాలర్ల మేర బయటకు వెళ్లిపోయాయి. విదేశీ మారకం నిల్వలు క్యూ4లో 8.8 బిలియన్‌ డాలర్ల మేర నికరంగా పెరిగాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఈ పెరుగుదల 30.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

విదేశీ రుణం 736 బిలియన్‌ డాలర్లు 
ప్రభుత్వ విదేశీ రుణ భారం గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే 10 శాతం పెరిగి 736.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. 2024 మార్చి నాటికి ఇది 668.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జీడీపీలో విదేశీ రుణ భారం 18.5 శాతం నుంచి 19.1 శాతానికి పెరిగింది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)