Breaking News

రూ.10 లక్షల కోట్లు! స్వదేశానికి మనోళ్లు పంపించిన నిధులివి..

Published on Thu, 06/27/2024 - 09:30

వాషింగ్టన్‌: ప్రవాస భారతీయులు స్వదేశం పట్ల అపారమైన అభిమానం చాటుతున్నారు. కష్టార్జితాన్ని తాముంటున్న చోటే దాచుకోకుండా, స్వదేశానికి పెద్ద ఎత్తున పంపిస్తున్నారు. స్వదేశంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. మాతృభూమికి నిధులు పంపించడంలో (రెమిటెన్స్‌లు) ప్రపంచదేశాల్లోనే ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు.

2023లో 120 బిలియన్‌ డాలర్ల (రూ.10లక్షల కోట్లు సుమారు) రెమిటెన్స్‌లను భారత్‌ అందుకున్నట్టు ప్రపంచబ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. అదే ఏడాది మెక్సికోకు వెళ్లిన 66 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లతో పోల్చిచూస్తే భారత్‌కు రెట్టింపు వచ్చినట్టు తెలిపింది. ఆ తర్వాత చైనాకు 50 బిలియన్‌ డాలర్లు, ఫిలిప్పీన్స్‌కు 39 బిలియన్‌ డాలర్లు, పాకిస్థాన్‌కు 27 బిలియన్‌ డాలర్ల రెమెటెన్స్‌లు వెళ్లాయి.

భారత్‌కు 2023లో అత్యధికంగా అమెరికా, యూఏఈ నుంచే రెమిటెన్స్‌లు వచ్చాయి.  సీమాంతర చెల్లింపులకు దీర్హామ్‌–రూపీలను అనుమతించడంతో అధికారిక ఛానళ్ల ద్వారా వచ్చే రెమిటెన్స్‌లు పెరిగినట్టు ప్రపంచబ్యాంక్‌ తెలిపింది. ఇక 2024 సంవత్సరంలో భారత్‌కు 3.7 శాతం అధికంగా 124 బిలియన్‌ డాలర్ల రెమిటెన్స్‌లు రావచ్చని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది. 2025లో మరో 4 శాతం పెరిగి 129 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని పేర్కొంది.

భారత్‌ తన యూపీఐని యూఏఈ, సింగపూర్‌తో అనుసంధానించేందుకు చేపడుతున్న చర్యలు వ్యయాలను తగ్గిస్తుందని, ఇది రెమిటెన్స్‌లను మరింత వేగవంతం చేయవచ్చని తెలిపింది. వలసపోవడం, వారి ద్వారా స్వదేశానికి నిధుల తరలింపు అన్నది ఆర్థిక, మానవాభివృద్ధికి అత్యవసరమని ప్రపంచబ్యాంక్‌లో సామాజిక పరిరక్షణ విభాగం గ్లోబల్‌ డైరెక్టర్‌ ఇఫత్‌ షరీఫ్‌ పేర్కొన్నారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు