Breaking News

ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌లో భారత్‌ టాప్‌

Published on Sun, 09/21/2025 - 05:50

న్యూఢిల్లీ: భారత కో–వర్కింగ్‌ స్పేస్‌ మార్కెట్‌ అంతర్జాతీయ మెచ్యూరిటీ సూచీలో మొదటి స్థానంలో నిలిచినట్టు కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ నివేదిక వెల్లడించింది. యూకే, ఫ్రాన్స్, యూఎస్, జపాన్, సింగపూర్‌ మార్కెట్లను భారత్‌ వెనక్కి నెట్టేయడం గమనార్హం. ‘ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌లో ప్రపంచ ధోరణలు, 2025’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రపంచ వ్యాప్తంగా వివిధ మార్కెట్లలోని మొత్తం ఆఫీస్‌ స్పేస్‌లో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ భిన్నంగా ఉంది. 

కొన్ని అభివృద్ధి చెందిన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ పెద్ద స్థాయిలో లేదు. అదే కొన్ని వర్ధమాన మార్కెట్లలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ ప్రొవైడర్లు బలమైన ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు’’అని తెలిపింది. కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌లో భారత్‌ 100 స్కోరు సాధించింది. ప్రపంచంలో పేరొందిన ఆఫీస్‌ మార్కెట్లు అయిన యూకే 98, ఫ్రాన్స్‌ 97, యూఎస్‌ 81, జపా న్, సింగపూర్‌ 77% స్కోరుతో భారత్‌ కంటే వెనుకునే ఉన్నాయి. మొత్తం ఆఫీస్‌ స్పేస్‌ పరిమాణంలో ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ (అన్ని వసతులతో, కోరుకున్నన్ని రోజులకు అద్దెకు లభించేది) ఎంతుంది? ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ ప్రొవైడర్ల సంఖ్య ఆధారంగా కుష్‌మన్‌ అండ్‌ వేక్‌ఫీల్డ్‌ ఈ నివేదికను రూపొందించింది.  

79.7 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ 
భారత్‌లోని టాప్‌–8 నగరాల్లో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ 79.7 మిలియన్‌ చదరపు అడుగులు (ఎస్‌ఎఫ్‌టీ) ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ‘‘భారత ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ రంగం ప్రపంచంలో పేస్‌సెట్టర్‌ (విస్తరణ వేగం పరంగా కొత్త ధోరణి)గా నిలిచింది. పరిపక్వత, కార్యాక లాపాల్లో వైవిధ్యం, డిమాండ్‌కు అనుగుణంగా సామర్థ్యం పెంచుకోవడం భారత మార్కెట్‌ను ప్రత్యేకంగా నిలిపింది’’అని పేర్కొంది.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)